Mokshagna : అవసరం ఉన్నప్పుడు కాళ్లు పట్టుకున్నారు, తీరాక కారుకూతలు.. మోక్షజ్ఞ సంచలన వ్యాఖ్యలు
Mokshagna : ఏపీలో హెల్త్ యూనిర్సిటీ పేరు మార్పు రచ్చ ఇప్పుడు ఏపీలో హాట్ హాట్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామకృష్ణ, బాలకృష్ణ వంటి వారు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకులు అంటూ చిన్న ట్వీట్ మాత్రమే చేశారు జూనియర్. పేరు మార్పు వైఎస్‌ఆర్ గౌరవం పెంచదని, ఆలా అని ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని వ్యాఖ్యానించారు తారక్. […]
Mokshagna : ఏపీలో హెల్త్ యూనిర్సిటీ పేరు మార్పు రచ్చ ఇప్పుడు ఏపీలో హాట్ హాట్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామకృష్ణ, బాలకృష్ణ వంటి వారు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకులు అంటూ చిన్న ట్వీట్ మాత్రమే చేశారు జూనియర్. పేరు మార్పు వైఎస్‌ఆర్ గౌరవం పెంచదని, ఆలా అని ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని వ్యాఖ్యానించారు తారక్. ఎన్టీఆర్‌పై ప్రజల హృదయాల్లో ఉన్న జ్ఞాపకాలను చెరిపివేయలేరని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు .
Mokshagna : తనయుడి ఆగ్రహం..
ఇక జూనియర్ ట్వీట్ తర్వాత బాలయ్య ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు” అంటూ వారందరిపై నిప్పులు చెరిగారు బాలయ్య. పంచభూతాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ఇక బాలయ్య చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. దారుమైన కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో బాలయ్య తనయుడు రంగంలోకి దిగారు.
బాలయ్య మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్న కొన్ని కుక్కలకు అంటూ సంబోధించిన ఆయన మీరు ఎంత చేసినా బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ల దగ్గరికి వచ్చిన వారే అవసరం తీరిపోయాక కారు కూతలు కూస్తే కాలమే సమాధానం చెబుతుంది అంటూ మోక్షజ్ఞ తేజ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. అయితే ఈ అకౌంట్ నిజంగా నందమూరి మోక్షజ్ఞదేనా లేక ఆయన పేరుతో నందమూరి అభిమానులు నడిపిస్తున్నారా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఆ అకౌంట్ ను గనక పరిశీలిస్తే నందమూరి మోక్షజ్ఞ అఫీషియల్ అనే పేరుతో ఉంది. దీనికి 14,200 మంది ఫాలోవర్స్ ఉన్నారు.