Bandi Sanjay : డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేల పేర్లను కేసీఆర్ ఎందుకు బయటపెట్టడం లేదు? ప్రశ్నించిన బండి సంజయ్? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bandi Sanjay : డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేల పేర్లను కేసీఆర్ ఎందుకు బయటపెట్టడం లేదు? ప్రశ్నించిన బండి సంజయ్?

Bandi Sanjay : కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు తెలంగాణ మెడకు చుట్టుకుంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఇదే విషయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మాట్లాడారు. మల్కాజ్ గిరిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్… డ్రగ్స్ కేసుపై సంచలన విషయాలను బయటపెట్టారు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 April 2021,9:30 am

Bandi Sanjay : కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు తెలంగాణ మెడకు చుట్టుకుంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఇదే విషయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మాట్లాడారు.

band sanjay questions cm kcr over drugs case

band sanjay questions cm kcr over drugs case

మల్కాజ్ గిరిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్… డ్రగ్స్ కేసుపై సంచలన విషయాలను బయటపెట్టారు.

డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని… ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా సీఎం కేసీఆర్ కు తెలుసని బండి సంజయ్ అన్నారు. వాళ్లలో సీఎం కేసీఆర్ రాజీనామా చేయించాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ పార్టీ తన ఏడేళ్ల పాలనలో ఎన్నో అక్రమాలకు పాల్పడింది. క్లబ్బులు, పబ్బులు, గుట్కా, మట్కా, ఇసుక మాఫియా, లాండ్ మాఫియాకు తెర లేపింది. తాజాగా డ్రగ్స్ దందాకు తెర లేపింది. కరోనా పరీక్షలు నిర్వహించినట్టే… అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలకు రక్త పరీక్ష చేయిస్తే అసలు దొంగలు ఎవరో తేలిపోతుంది.. అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Bandi Sanjay : హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఎక్కడికి పోయింది?

బెంగళూరు డ్రగ్స్ కేసులాగానే.. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లోనూ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసు అప్పుడే అటకెక్కింది. దాని గురించి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.. అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నా… కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఆ వార్తలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? అది నిజమనేగా? వాళ్లు ఎవరో కూడా కేసీఆర్ కు తెలుసు. వారితో వెంటనే రాజీనామా చేయిస్తేనే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. కానీ.. వాళ్లను కాపాడాలని చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు.. అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది