తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో పీక్స్‌కు చేరాయి. తాజాగా మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాతో ఇంకా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అయితే, ఈటల రాజీనామా, తదనంతర పరిణామాల్లో బీజేపీలోనూ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెంటర్ ఆఫ్ ద టాపిక్ గా మారుతున్నారని అటు కేడర్ ఇటు నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఆది నుంచి బండి సంజయ్ పై గరంగా ఉన్న నేతలే .. దీనివెనుక కీ రోల్ పోషిస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. అందుకోసం వీరంతా .. టైం చూసి, కొడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, అనంతరం బీజేపీలో చేరడాన్ని పార్టీ నేతలు కొందరు వ్యతిరేకించారు. ఈటెలను చేర్చుకునే సమయంలో వీరి అభిప్రాయాలకు బండి సంజయ్ విలువ ఇవ్వలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపించాయి. ఇదే సమయంలో ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. అదే అదునుగా ఈటెల రాకను వ్యతిరేకిస్తోన్న ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు బీజేపీని వీడటం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ తమ లేఖలో ఈటలను చేర్చుకుని తప్పు చేశారంటూ ప్రకటించడం విశేషం. కనీసం తమకు తెలపలేదని, తమతో చర్చించలేదని వీరిద్దరూ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనే ఆరోపణలు గుప్పించారు.
వలసలే ..
ఇదిలా ఉంటే, పలువురు బీజేపీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు బీజేపీ నేతల్లో ఆందోళనకు కారణంగా మారాయి. ఇదే .. ఇప్పుడు బండి సంజయ్ పై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టేలా చేస్తోంది. ముందునుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకాన్ని తప్పు పట్టిన కొంతమంది పార్టీని పలువురు నేతలు వీడుతున్నా, బండి సీరియస్ గా తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆయన్ని వ్యతిరేకిస్తోన్న నేతలు వలసల్ని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈటెల సాకుతో సంజయ్ దూకుడుకు బ్రేక్ వేసే వ్యూహం పన్నుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి దీన్నుంచి బండి సంజయ్ ఏవిధంగా బయటపడతారన్న చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. ఏదేమైనా ఈటెల రాక .. బండికి ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తుండడం విశేషం.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.