Bandi Sanjay : ఆరోజు నుంచే బండి సంజయ్ పాదయాత్ర? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే?
Bandi Sanjay : బండి సంజయ్.. ఈ పేరు దుబ్బాక ఉపఎన్నిక సమయం నుంచి తెలంగాణలో బాగా వినిపిస్తోంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయదుందుబి మోగించడంతో బండి సంజయ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా కూడా బండి సంజయ్ గురించి ఆరా తీయడం.. ఆయన్ను ఢిల్లీకి పిలిచి ప్రశంసించడం కూడా జరిగాయి. అందుకే తెలంగాణలో బండి సంజయ్ మాంచి దమ్మున్న రాజకీయ నాయకుడయ్యారు.
తెలంగాణలో బీజేపీలో దమ్మున్న నాయకుల్లో బండి సంజయ్ ఒకరు. దుబ్బాక ఉపఎన్నిక గెలుపులోనూ బండి సంజయ్ పాత్ర ఎనలేనిది. అందుకే తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని.. బీజేపీ పార్టీని మొత్తం హైకమాండ్ బండి చేతుల్లో పెట్టింది. అందుకే.. బండి సంజయ్ 2023 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు.
Bandi Sanjay : శ్రీరామనవమి రోజున బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం
అందుకే బండి సంజయ్ శ్రీరామనవమి రోజున తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించనున్నారట. రాముడి కళ్యాణం జరిగే రోజున శుభదినంగా భావించి.. ఆరోజు శ్రీరాముడికి మొక్కుకొని ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభిస్తారట. క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకొని వారికి భరోసా ఇవ్వనున్నారు బండి. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వరకు బండి సంజయ్ పాదయాత్ర ఉంటుందని సమాచారం.
ఆదిలాబాద్ నుంచి ఆశ్వారావుపేట మధ్యలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే.. రాజకీయంగా సీఎం కేసీఆర్ ను బాగా ఇబ్బంది పెట్టాలి. దాని కోసం ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. దానికి పాదయాత్ర అయితేనే బెటర్ అని బండి సంజయ్ భావిస్తున్నారట. మరి.. బండి సంజయ్ శ్రీరామనవమి రోజున తన పాదయాత్రను ప్రారంభిస్తారా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.