Bandi sanjay హైదరాబాద్ : తెలంగాణ Telangana బీజేపీ BJP అధ్యక్షుడు బండి సంజయ్ Bandi sanjay పాదయాత్రకు రెడీ అవుతున్నారు. భారీ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరు నిర్ణయించారు. ఈ మేరకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో శుక్రవారం నాడు ఎమ్మెల్యే రాజా సింగ్, BJP నేతలు బాబు మోహన్, డాక్టర్ చంద్రశేఖర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్ర పేరును ప్రకటించారు.
ఆగస్టు 24న భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ఆరంభం కానుందని MLA రాజా సింగ్ వెల్లడించారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అయితే.. ఆగస్టు 9నే పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా వాయిదా పడింది. అయితే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేపథ్యంలో తన ఎంపీలకు BJP విప్ జారీచేయడంతో MP బండి సంజయ్ తప్పనిసరిగా ఢిల్లీలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను ఆగస్టు 24 నుంచి చేపట్టాలని నిర్ణయించారు.
మరోవైపు, కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి G. కిషన్‌రెడ్డి ఈనెల 16 నుంచి రాష్ట్రంలో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలోనూ సంజయ్ పాల్గొనాల్సి ఉండటంతో ఆయా కారణాల దృష్ట్యా సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. కేంద్రంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈనెల 16న రాష్ట్రానికి వస్తున్న కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద భారీగా కిషన్ రెడ్డికి స్వాగతం పలుకనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాకే హుజూరాబాద్ నియోజకవర్గంలో సంజయ్ పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
వారం రోజుల పాటు ఆయన ఆ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా బీజేపీ వర్గాలు ప్లాన్ చేశాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇక బండి సంజయ్ కు ఎదురే లేదనే ప్రచారం సాగింది. దీంతో ఆ పార్టీ నేతలే సంజయ్ కు చెక్ పెట్టాలని భావిస్తూ బండి సంజయ్ తీసుకునే నిర్ణయాలు కార్యరూపం దాల్చకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆ పార్టీ విజయాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైనా నాయకుల మధ్య సఖ్యత పెరిగి పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించి పార్టీ విజయానికి బాధ్యత వహించాలని కార్యకర్తలు కోరుతున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.