Bank Holidays : అలర్ట్: వచ్చే 5 రోజులు బ్యాంకులకు సెలవులు..!
Bank Holidays : ఖాతాదారులందరికీ బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. తద్వారా వారి బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వారం వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు బంద్ అవ్వనున్నాయి.
ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మంగళవారం నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను ప్రకటించింది. జనవరి 11న నేషనల్ మిషనరీస్ డే, 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి, 13న భోగి, 14న మకర సంక్రాంతి, 16న ఆదివారం కారణంగా వచ్చే అయిదు రోజులు.. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు ఈ మేరకు మూతపడనున్నాయి.
జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని సెలవులకు బ్యాంకులకు కూడా సెలవులు వర్తిస్తుండగా.. రాష్ట్ర స్థాయి పండుగలకు మాత్రం ఒక్కో రాష్ట్రాన్ని బట్టి బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో కాకుండా.. వీకెండ్‌లో కూడా బ్యాంకులు పని చేయవు. అయితే ఈ సెలవు రోజుల్లో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి.