Bank Holidays : మూడు రోజులు బ్యాంకులు బంద్
ప్రధానాంశాలు:
Bank Holidays : మూడు రోజులు బ్యాంకులు బంద్
Bank Holidays : మార్చి 13, 14, 15 తేదీల్లో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు బంద్ ఉండనున్నాయి. హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. మార్చి 13న హోలికా దహనం సందర్భంగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. అయితే నాగాలాండ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు యథావిధిగా పని చేయనున్నాయి. మార్చి 15న బిహార్, మణిపూర్, త్రిపురలో హోలీ సెలవు ఉండటంతో అక్కడ బ్యాంకులు మూసివేయబడతాయి.

Bank Holidays : మూడు రోజులు బ్యాంకులు బంద్
ఇవేవీ కాకుండా ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో మరికొన్ని సెలవులు కూడా ఉండనున్నాయి. మార్చి 16, 23, 30 ఆదివారాలు, అలాగే మార్చి 22 (నాలుగో శనివారం) రోజున దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. మార్చి 27న షబ్-ఎ-ఖదర్ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో బ్యాంకులు పనిచేయవు. ఇక మార్చి 31న ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగతా అన్నీ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగాది పండుగ కూడా ఈ నెలలో జరుపుకుంటుండటంతో, బ్యాంకింగ్ సేవల విషయంలో ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్యాంకు బ్రాంచ్‌లు మూసివుండటంతో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ, బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, బిల్లుల చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీలు సులభతరం చేయనున్నాయి. అయితే మొత్తం నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్ చేయాలనుకునే ఖాతాదారులు బ్యాంకింగ్ సెలవులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే తమ అవసరాలను పూర్తి చేసుకోవాలి. బ్యాంకింగ్ లావాదేవీల్లో ఏ విధమైన అంతరాయం కలగకుండా ఖాతాదారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం మంచిది.