jobs Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

jobs Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

 Authored By mallesh | The Telugu News | Updated on :15 January 2022,4:02 pm

job notification : నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొవిడ్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్, ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ ఈ నెల 7న స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఈ నెల 27గా డిసైడ్ చేశారు.

కాబట్టి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ డేట్ లోపే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్డ్‌గా స్టడీ చేయాల్సి ఉంటుంది.ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్ సైట్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో కెరీర్ ఆప్షన్ ఎంచుకుని, కరెంట్ ఆపర్చునిటీస్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిక్రూట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, వెల్త్ మేనేజ్ మెంట్ సర్విసెస్ డిపార్ట్ మెంట్ .. మీకు అర్హత ఉన్న జాబ్ ప్రొఫైల్ సెలక్ట్ చేసుకుని ‘అప్లై నవ్ ’ అనే బటన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి..

Bank of Baroda released jobs notification

Bank of Baroda released jobs notification

jobs Notification: ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోండి.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఆ తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం మీ అప్లికేషన్ ను మీ దగ్గరే ఉంచుకోండి. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగంలో మొత్తం 58 ఖాళీలు ఉండగా, అగ్రి బ్యాంకింగ్ విభాగంలో 47 అగ్రికల్చర్ మార్కెటింగ్ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న క్రమంలో అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన.. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ కంపల్సరీగా కలిగి ఉండాలి. సంబంధిత విభాగం అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చదువుకున్న తర్వాతనే అప్లై చేయాల్సి ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది