చనిపోతూ కొడుక్కి ఆ వాచ్ ఇచ్చిన తండ్రి .. దానిని అతడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్ళపెడతారు ..!!
ప్రతి తండ్రి తన కొడుకుకి ఏదో ఒకటి చిన్నతనం నుండి చెబుతూ ఉంటాడు. ఎందుకంటే తను పడ్డ కష్టాలు తన కొడుకు పడకూడదు అని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అయితే ఒక తండ్రి చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి తన దగ్గర ఉన్న అతి పురాతనమైన వాచ్ ను ఇచ్చాడు. దాదాపుగా ఆ వాచ్ 200 సంవత్సరాల క్రిందటిది. మన పూర్వీకుల నుండి ఈ వాచ్ ఉపయోగిస్తూ వచ్చాము ఇప్పుడు నువ్వు ఈ వాచ్ ను […]
ప్రతి తండ్రి తన కొడుకుకి ఏదో ఒకటి చిన్నతనం నుండి చెబుతూ ఉంటాడు. ఎందుకంటే తను పడ్డ కష్టాలు తన కొడుకు పడకూడదు అని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అయితే ఒక తండ్రి చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి తన దగ్గర ఉన్న అతి పురాతనమైన వాచ్ ను ఇచ్చాడు. దాదాపుగా ఆ వాచ్ 200 సంవత్సరాల క్రిందటిది. మన పూర్వీకుల నుండి ఈ వాచ్ ఉపయోగిస్తూ వచ్చాము ఇప్పుడు నువ్వు ఈ వాచ్ ను నగల దుకాణంలో అన్ని డబ్బులు తీసుకొని రా. కానీ ఒక కండిషన్ మొదటగా ఎంత డబ్బులు ఈ వాచ్ కు ఇస్తారో కనుక్కో ఒకవేళ ఆ ధర సరైనది అయితే నేను నీకు అమ్మమని చెప్తాను అని కొడుకుకి చెప్పి పంపించాడు.
దీంతో కొడుకు నగల దుకాణంలోకి వెళ్లి ఆ వాచ్ ను ఎంతవరకు ఇస్తారో కనుక్కున్నాడు. చాలా పాత వస్తువు ఇది కాబట్టి 150 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్తారు. అప్పుడు తన తండ్రికి ఈ విషయం గురించి చెప్పగా ఈసారి పాన్ షాప్ దగ్గరికి వెళ్లి కనుక్కోమంటాడు. అప్పుడు ఈ వస్తువు పది రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేమని వాళ్ళు అంటారు. ఈసారి తండ్రి కొడుకుతో మ్యూజియం దగ్గరికి వెళ్లి దీని ధర ఎంత కొనుక్కో అని అంటాడు. వాళ్లు అది చూసి ఈ వాచ్ చాలా పురాతనమైనది మరియు అరుదైనది. దీనికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వగలమని చెప్పారు. దీంతో కొడుకు ఆశ్చర్యపోయి తండ్రి దగ్గరికి వెళ్లి జరిగినదంత చెప్తాడు.
అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అంటాడు. ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది. ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు, అలా అని బాధపడతు ఎదుటివారిని తప్పుగా అనుకోవాల్సిన పనిలేదు. పైగా వాళ్ల వల్ల ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి నీకు విలువ ఉన్నచోట మాత్రం ఉండు అంతేగాని నీకు విలువ లేని చోట ఉండకు అని ఆ తండ్రి కొడుకుకి చెప్తాడు. ఒకరు మనకి విలువ ఇవ్వట్లేదు అని మనకు విలువ లేదు అని కాదు అర్థం. మన విలువ వేరే వారి దగ్గర ఎక్కువ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ప్రతి వారికి కూడా విలువ ఉంటుంది. కానీ ఎక్కడ విలువ ఉంటది అనే విషయాన్ని మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది.