Sampangi Tree And Flower : రాత్రిపూట స్త్రీలు సంపంగి పూలను ఏం చేస్తారో తెలుసా?
Sampangi Tree And Flower : మీరు ఎప్పుడైనా సంపెంగ పువ్వు గురించి విన్నారా? దాన్ని చూశారా ఎప్పుడైనా? సంపెంగ పువ్వు అనేది చూడటానికి పసుపు రంగులో ఉంటుంది. దాని వాసన అయితే ఒక కిలోమీటర్ వరకు వస్తుంది అంటారు. అంటే.. దానికి అంత వాసన వస్తుంది అన్నమాట. ఎంతో మంచి వాసన వచ్చే ఈపువ్వు గురించి ఈ సంపెంగ చెట్టు గురించి చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇది తీగ జాతికి చెందిన చెట్టు. అద్భుతమైన సువాసన వెదజల్లుతుంది సంపెంగ పువ్వు.
సువాసనలో రారాజుగా సంపెంగ ఉంటుంది. ఈ చెట్టు దగ్గరికి రాత్రి పూట వెళ్లకూడదు అంటారు. ఎందుకంటే దాని సువాసనను చూసి చాలా జంతువులు, క్రిమి కీటకాలు ఆ చెట్టు దగ్గరికి వెళ్తాయట. అందుకే.. రాత్రి పూట ఆ చెట్టు దగ్గరికి అస్సలు వెళ్లకూడదు. అయితే.. స్త్రీల కోసం, వాళ్లకు ఉండే సమస్యల కోసం సంపెంగ చాలా ఉపయోగపడుతుంది. సంపెంగ పువ్వే కాదు.. ఆ చెట్లు అణువణువు కూడా ఔషధాలతో కూడుకున్నదే. సంపెంగ వేరును చితక్కొట్టి చెంచాడు వేడి నీళ్లతో కలిసి స్త్రీలు తీసుకుంటే వాళ్లకు రుతుక్రమం సరిగ్గా అవుతుంది.
Sampangi Tree And Flower : మగవారికి కూడా సంపెంగ వల్ల చాలా ఉపయోగాలు
మగవారు అయితే మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు కూడా సంపెంగ వేరును తీసుకొని దాన్ని కషాయం కింద చేసుకొని తీసుకోవాలి. సంపెంగ వేరును చితక్కొట్టి కొన్ని వేడి నీళ్లలో కలిపి కషాయంలా చేసుకొని తాగితే విరోచనాలు చక్కగా అవుతాయి. చాలామందికి నొప్పులు ఉంటాయి. అటువంటి వాళ్లు ఒక ఐదు లేదా ఆరు ఆకులు తీసుకొని కషాయం చేసుకొని తాగాల్సి ఉంటుంది. ఆకులను మరిగించి కషాయం చేసుకొని తాగాలి. శరీర దుర్వాసన పోవాలంటే సంపెంగ పూలను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా సంపెంగ చెట్టు వల్ల, పువ్వు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే చాలామంది తమ ఆరోగ్యం కోసం సంపెంగను నిత్య జీవితంలో వాడుతూ ఉంటారు.
https://youtu.be/B3hkCJXeWcU