Bhatti Vikramarka : త్వరలో సైకిల్ ఎక్కనున్న కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhatti Vikramarka : త్వరలో సైకిల్ ఎక్కనున్న కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క?

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 March 2021,11:15 am

Bhatti Vikramarka : మల్లు భట్టి విక్రమార్క.. తెలుసు కదా. తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. కొన్ని దశాబ్దాల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్నో పదవులను చేపట్టారు. ప్రస్తుతం ఆయనకు కాంగ్రెస్ లోనూ మంచి పొజిషనే ఇచ్చారు. అంతా బాగానే ఉంది కదా.. పోయి పోయి.. తెలంగాణలో దిక్కూదివానా లేని టీడీపీలో ఎందుకు చేరుతున్నారు.. అనే డౌటనుమానం మీకు వచ్చి ఉంటుంది. ఆయన సైకిల్ ఎక్కుతున్నారు.. అంటే టీడీపీలో చేరుతున్నారని కాదు. ఆయన త్వరలో తెలంగాణలో సైకిల్ యాత్ర చేపట్టనున్నారు.

bhatti vikramarka to start cycle yatra in telangana

bhatti vikramarka to start cycle yatra in telangana

తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రేవంత్ రెడ్డి రాజీవ్ భరోసా యాత్ర చేపట్టారు. ఆ యాత్రలో భాగంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర కూడా చేశారు. త్వరలో మరో పాదయాత్ర చేపట్టనున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు బాగానే రెస్పాన్స్ వచ్చింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> అది రేవంత్ రెడ్డి దెబ్బ అంటే.. దెబ్బకు అందరూ సెట్ రైట్ అయ్యారు?

అందుకే.. కాంగ్రెస్ కు చెందిన మరికొందరు సీనియర్ నేతలు కూడా ఏదో ఒక యాత్ర చేపట్టి.. పార్టీ నుంచి ప్రశంసలు పొందాలని చూస్తున్నారు. హైకమాండ్ ఒక్క రేవంత్ రెడ్డినే పట్టించుకుంటే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే.. క్రెడిట్ మొత్తం రేవంత్ కే పోతుంది కదా. అందుకే.. మిగితా నేతలు కూడా అలర్ట్ అయి ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

Bhatti Vikramarka : సుమారు 250 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయనున్న భట్టి?

అందుకే భట్టి విక్రమార్క కూడా ప్రజల్లో ఉండటం కోసం సరికొత్తగా సైకిల్ యాత్రను చేపట్టనున్నారు. అలాగే పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెరగడంతో వాటికి నిరసనగా యాత్ర చేపట్టి.. అలాగే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొననున్నారు.

భట్టి సైకిల్ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి నుంచి ప్రారంభం కాగా… ఈనెల 8 నుంచి ఆయన సైకిల్ యాత్ర ప్రారంభం కానుంది. సుమారు 250 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్రను భట్టి చేపట్టనున్నారు.

మరి.. అసలే ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మరి.. భట్టి సైకిల్ యాత్ర.. కాంగ్రెస్ కు ఏమైనా మేలు చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

ఇది కూడా చ‌ద‌వండి ==> అది రేవంత్ రెడ్డి దెబ్బ అంటే.. దెబ్బకు అందరూ సెట్ రైట్ అయ్యారు?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది