Bhupendrabhai Patel : గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: December 8, 2022, 2:00 pm

Bhupendrabhai Patel : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలవడం జరిగింది. కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలు కనీసం పోటీకి కూడా రాలేకపోయాయి. తాజా విజయంతో వరుసగా గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఏడుసార్లు గెలిచినట్లయింది. స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతున్న కమలం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

దీంతో ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ రెండోసారి మళ్లీ ముఖ్యమంత్రి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ఈనెల 10న లేదా 11 వ తారీకున ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ ఇంకా కేంద్రం హోం మంత్రి అమిత్ షా…

Bhupendrabhai Patel is the new Chief Minister of Gujarat

Bhupendrabhai Patel is the new Chief Minister of Gujarat

పలువురు బిజెపికి కీలక నాయకులు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భూపేంద్ర పటేల్ గట్లోదియా.. నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. 158 స్థానాలకు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ 92 సీట్లను దాటి బీజేపీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తూ ఉండటంతో బీజేపీ కార్యకర్తలు… సంబరాలు చేసుకుంటున్నరు.

 

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp