Corona Vaccine : 11 సార్లు కరోనా టీకా వేసుకున్న 84 ఏళ్ల వృద్ధుడు.. ఆ తర్వాత ఏమైందో తెలుసా..?
Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడమే శ్రేయస్కరమని ప్రభుత్వం చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ మాటకు అనుగుణంగా ఇప్పటికే దేశంలో కొంత మంది తమ రెండు డోసులను పూర్తి చేసుకోగా.. ఇంకా అనేక మంది ఒక డోసుతోనే సరి పెడుతున్నారు. సమయం లేదనే, బద్దకంతోనో, భయంతోనే వ్యాక్సిన్ జోలికి పోవడం లేదు. అయితే ఇందుకు విచిత్రంగా ఓ వృద్దుడు మాత్రం మూడు కాదు నాలుగు కాదు ఏకంగా 11 సార్లు కరోనా టీకా డోసులు వేయించుకున్నాడు. బీహార్ లోని ఈ వృద్ధుని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
బీహార్ మాధేపుర జిల్లాకు చెందిన వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్(84)… తాను కరోనా టీకా 11 డోసులు తీసుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే తాను వీలైనన్ని ఎక్కువసార్లు వేసుకున్నానని వివరించారు. అంతటితో ఆగక.. తాను మరో డోసు తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు 12 వ డోసు తీసుకునేందుకు వచ్చిన బ్రహ్మ దేవ్… అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. టీకాల కార్యక్రమం ముగియడంతో విచారం వ్యక్తం చేశాడు.
Corona Vaccine : 12 వ డోసు కోసమూ తీవ్ర ప్రయత్నాలు…!
బ్రహ్మ దేవ్ మాటలు విన్న వైద్య సిబ్బంది అతనిని ఆరా తీయగా వారికి ఊహించని విషయాలు తెలియడంతో ఒక్కసారిగా అవక్కాయ్యారు. బ్రహ్మ దేవ్ తన తొలి డోసును 13 ఫిబ్రవరి, 2021న తీసుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి వరుసగా 2021 డిసెంబరు వరకు 11 డోసులు పొందారు. ఇదిలా ఉంచితే ఆయన ఏయే తేదీల్లో టీకా తీసుకున్నది కూడా రాసి పెట్టు కోవడం విశేషం. బ్రహ్మ దేవ్ గతంలో ఈ వృద్దుడు పోస్టల్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందాడట. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడీ వృద్దుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. తమకు రెండో డోసుకే దిక్కు లేదు.. మీకు 11 డోసులు ఎవరిచ్చారు సామీ అంటూ కామెడీగా కామెంట్లు పెడుతున్నారు.
84-year-old Brahamdev Mandal, a resident of Puraini in Madhepura district, claims he has taken 11 doses of #COVID19Vaccine.
“I never fell ill since I started taking the vaccine and my health has started to improve,” says Brahamdev. pic.twitter.com/dQhNzxJ5FV
— NDTV (@ndtv) January 6, 2022