Rabies Vaccine : టీకా వేయడంలో పొరపాటు.. కుక్క కాటు వ్యాక్సిన్ రేబిస్ వేశారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rabies Vaccine : టీకా వేయడంలో పొరపాటు.. కుక్క కాటు వ్యాక్సిన్ రేబిస్ వేశారు..!

Rabies Vaccine : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా టీకాను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా టీకాను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. కాకపోతే ముందే రిజిస్టర్ చేసుకొని వాళ్లు చెప్పిన సమయానికి వెళ్లి టీకా వేయించుకొని రావాలి. తెలంగాణ రాష్ట్రంలోనూ టీకా ప్ర్రక్రియ కొనసాగుతోంది. అయితే.. ప్రతి మండంలో వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి.. ఆ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వాళ్లు అక్కడే వేసుకునేలా అన్ని చర్యలు చేపట్టారు అధికారులు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 June 2021,9:30 am

Rabies Vaccine : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా టీకాను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా టీకాను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. కాకపోతే ముందే రిజిస్టర్ చేసుకొని వాళ్లు చెప్పిన సమయానికి వెళ్లి టీకా వేయించుకొని రావాలి. తెలంగాణ రాష్ట్రంలోనూ టీకా ప్ర్రక్రియ కొనసాగుతోంది. అయితే.. ప్రతి మండంలో వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి.. ఆ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వాళ్లు అక్కడే వేసుకునేలా అన్ని చర్యలు చేపట్టారు అధికారులు. అయితే.. కొన్ని చోట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యాల వల్ల కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు కావాలని ఖాళీ సిరంజీని గుచ్చడం, కొందరు వ్యాక్సిన్ ను కల్తీ చేయడం లాంటివి చేసి.. వ్యాక్సిన్లను దొంగచాటుగా అమ్ముకుంటున్న ఘటనను మనం రోజూ టీవీల్లో చూస్తూనే ఉన్నాం.

rabies vaccine injected instead of covid vaccine

rabies vaccine injected instead of covid vaccine

తాజాగా.. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మాత్రం.. అసలు కరోనా టీకాకు బదులు వేరే టీకాను వేశారు వైద్య సిబ్బంది. ఈ ఘటన జిల్లాలోని కట్టంగూరు మండలంలో చోటు చేసుకుంది. బొల్లెపల్లిలో ఉన్న ప్రభుత్వ స్కూల్ లో పనిచేస్తున్న కార్మికురాలు.. కరోనా టీకా కోసం స్కూల్ హెడ్ మాస్టర్ లెటర్ తీసుకొని.. కట్టంగూరు పీహెచ్సీకి వెళ్లింది.

Rabies Vaccine : యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ను ఇచ్చిన నర్సు

అక్కడ రెండు సెంటర్లు ఉన్నాయి. ఒకటి సాధారణ టీకాల సెంటర్, మరొకటి కరోనా వ్యాక్సిన్ సెంటర్. అయితే.. ఈ విషయం తెలియని ఆ మహిళ.. సాధారణ టీకాలు ఇచ్చే సెంటర్ కు వెళ్లి.. హెడ్ మాస్టర్ ఇచ్చిన లెటర్ ను నర్సుకు ఇచ్చింది. నర్సు ఆ లెటర్ ను చూసుకోకుండానే.. వెంటనే ఆ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ను ఇచ్చింది. అది కుక్క కాటు కోసం ఇచ్చే మందు. తర్వాత అసలు విషయం తెలిసి ఆ మహిళ బోరుమంది.

వెంటనే మండల వైద్యాధికారికి ఈ విషయమై ఫిర్యాదు చేయగా.. బాధితురాలే.. తెలియకుండా వేరే బ్లాక్ కు వెళ్లి వేరే వ్యాక్సిన్ వేయించుకుందని.. నర్సు కూడా ఆమెకు కుక్క కరిచిందేమోనని ఆ వ్యాక్సిన్ ఇచ్చిందని తెలిపినా.. వైద్య సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ పలువురు వైద్య సిబందిపై గరం అవుతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది