KCR : బీహార్ పర్యటనతో కేసీయార్ జాతీయ రాజకీయానికెంత ప్రయోజనం.?
KCR : జాతీయ రాజకీయాలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలాకాలంగా చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేసీయార్, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమనీ చెప్పారు. అయితే, కాలం కలిసి రాలేదు. జాతీయ స్థాయిలో బీజేపీ బలం తగ్గకపోవడంతో, కేసీయార్ ఆశలు ఫలించడంలేదు. సరైన సమయం కోసం కేసీయార్ ఎదురుచూస్తూనే వున్నారు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ బలం తగ్గిందని అనలేం. పైగా, తెలంగాణలో బీజేపీ బలపడుతోంది.
జాతీయ స్థాయిలో కేసీయార్ చక్రం తిప్పడం సంగతి దేవుడెరుగు.. ముందైతే, తెలంగాణలో బీజేపీ నుంచి ఎదురయ్య తలనొప్పుల నుంచి కేసీయార్ బయటపడితే అదే గొKCR National Politicsప్ప.. అనే స్థాయికి తెలంగాణలో రాజకీయం మారిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి చావు తప్పి కన్ను లొట్టబోయిన మాట వాస్తవం. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అయితే, కేసీయార్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో బీజేపీని నైతికంగా దెబ్బ కొట్టడానికి కేసీయార్, జాతీయ రాజకీయం.. అనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అయితే, ఒకప్పటిలా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నాయకులు కేసీయార్‌తో కలిసి పనిచేసేందుకు అంత సుముఖంగా వున్నట్లు కనిపించడంలేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయినా, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి అయినా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయినా.. కేసీయార్ పట్ల ఎంత సానుకూలతతో వున్నారో చెప్పడం కష్టం. తాజాగా కేసీయార్ బీహార్ వెళ్ళారు. ముఖస్తుతి కోసమన్నట్లుగా నితీష్ కుమార్, కేసీయార్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. అంతే తప్ప, కేజీయార్ బీహార్ వెళ్ళడం వల్ల కేసీయార్ జాతీయ రాజకీయానికి ఈ పర్యటన ఏమాత్రం ఉపయోగపడేలా కనిపించడంలేదు.