Bandi Sanjay : సీఎం అయ్యేందుకు బండి సంజయ్ కొత్త వ్యూహం.. ఒక చోటు నుండి మరో చోటుకు!
Bandi Sanjay : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతుంది. అందుకే ఇప్పటి నుండే బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ముఖ్య మంత్రి పీఠంపై ఖర్చీఫ్ వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కనుక ఆ పార్టీ అధినాయకత్వం ఎవరు చెబితే వారే సీఎం. అయితే అంతకంటే ముందు ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాలి కనుక చాలా మంది సీనియర్ బీజేపీ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు ఇప్పుడు అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి పీఠం కోసం కొత్త వ్యూహం పన్నాడు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసిన విషయం తెల్సిందే. పోటీ చేసిన రెండు సార్లు కూడా అక్కడ ఓటమి తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ కి అనూహ్యంగా పార్లమెంటు సీటు దక్కడం.. పార్లమెంటు నియోజక వర్గం లో ఆయన గెలుపొందడం జరిగింది. మళ్లీ ఆయన పార్లమెంటుకు పోటీ చేసే ఉద్దేశ్యంతో లేడని వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ వచ్చే ఏడాది జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా వేములవాడ ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Bandi Sanjay : వేములవాడ ఎమ్మెల్యే చన్నమనేని వివాదం కలిసి వస్తుందని..
వేములవాడ ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ వారసత్వ వివాదం పై కోర్టులో కేసు నడుస్తుంది. ఆయన ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనాల తిరష్కరణకు గురి అయ్యే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ నుండి పోటీ చేస్తే విజయం సాధ్యం అనే ఉద్దేశ్యంతో ఉన్నాడట. అందుకే గత కొన్నాళ్లుగా అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఎంపీ నిధులతో అక్కడ అభివృద్దిని చేయడం మాత్రమే కాకుండా తాను ఇక్కడ నుండి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్తే బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాను అంటూ స్థానికులతో చెబుతున్నాడట. దాంతో అక్కడ ఆయన గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.