Eatala Rajendar : నువ్వేవడివి అసలు.. అంటూ బండి సంజయ్ పై ఈటెల ఫైర్..!
ప్రధానాంశాలు:
మరోసారి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఈటెల రాజేందర్
Eatala Rajendar : నువ్వేవడివి అసలు.. అంటూ బండి సంజయ్ పై ఈటెల ఫైర్..!
Eatala Rajendar : బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన స్వగ్రామం హుజురాబాద్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం శామీర్ పేట్ లో హుజురాబాద్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. “వీధి పోరాటాలు నాకు రావు.. స్ట్రెయిట్ ఫైట్ నాకు నచ్చుతుంది. కార్యకర్తల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయ స్థితిలో నేను లేను” అంటూ తేల్చిచెప్పారు. రాజకీయ అవమానాలను తట్టుకుంటానని.. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరని ఆయన భావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు బండి సంజయ్ నువ్వేవడివి అసలు..నీ శక్తి ఏంది నీ స్థాయి ఏంది.. నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది. 2002 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను.. రెండు సార్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసాను, రెండు సార్లు జిల్లా మంత్రిగా పని చేసాను..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. నా చరిత్ర నీకు తక్కువ తెలుసు కొడకా అంటూ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు.

Eatala Rajendar : నువ్వేవడివి అసలు.. అంటూ బండి సంజయ్ పై ఈటెల ఫైర్..!
Eatala Rajendar : బండి సంజయ్ నీ శక్తి ఏంది నీ స్థాయి ఏంది.. నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది – ఈటెల రాజేందర్
“హుజురాబాద్ చైతన్యానికి మారుపేరు. 2021లో భీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాం. ఆ సమయంలో తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నా, వెనక్కి తిప్పుకోలేదు. నా చరిత్ర ప్రజలకు తెలుసు. ఏ పార్టీలో ఉన్నా పూర్తిగా అంకితభావంతో పనిచేస్తాను. కోవర్టులు ఎక్కడైనా ఉంటారు. వాళ్లపై దృష్టిపెట్టడం లేదు. కార్యకర్తలు కుంగిపోవద్దు. హుజురాబాద్‌లో ఇప్పటికీ బలమైన బీజెపి కేడర్ ఉంది. నేను వచ్చాకే కరీంనగర్ లోక్‌సభకు 50 వేల మెజారిటీ వచ్చింది” అని వివరించారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా కొందరు కుట్రలు చేస్తున్నారని, అబద్ధాలపై రాజకీయం నడుపుతున్నారని ఆయన విమర్శించారు. “కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. నాకు అలాంటి రాజకీయం వద్దు. నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడతా. ఇకపై పదిరోజులకోసారి హుజురాబాద్ వస్తా. కార్యకర్తల కోసం ఎప్పటికీ వెన్నంటి ఉంటా” అంటూ హామీ ఇచ్చారు. రాజకీయాల్లో చిన్న మనస్కులు, కురుసా మనస్తత్వం ఉన్న వాళ్లు ఉంటారని తెలిపారు. వాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని ఉంటారని.. అలాంటిది వారితో యుద్ధం చేయడం కష్టమే కానీ ఎదురెళ్లి నిలబడాలని చెప్పుకొచ్చారు. ఇక నుంచి హుజురాబాద్‌లో ప్రతి మండలానికి ఒక కార్యాలయం ఉంటుందని తెలిపారు. ఈటల వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీ వర్గాల్లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.