BJP : వైసీపీతో అవసరాన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం.!
BJP : 2024 ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం వుంటుందట. అలాగని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. శతృవు మిత్రుడిగా మారొచ్చు. మిత్రుడు శతృవుగా కూడా మారొచ్చు. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పెద్దగా ‘స్టేక్’ లేదు. ఇది బీజేపీకి కూడా బాగా తెలుసు. ఏపీ వల్ల బీజేపీకి అదనంగా ఒరిగే రాజకీయ లాభం కూడా ఏమీ లేదు. అయితే, జాతీయ స్థాయిలో.. అంటే, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గనుక మూడోసారి బొటాబొటి మెజార్టీతో గెలిస్తే..
అప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల అవసరం ఏర్పడుతుంది. ఏపీలో అధికారంలో ఎవరున్నా, వారితో బీజేపీకి ఖచ్చితంగా అవసరమొస్తుంది. ఎటూ టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది గనుక, ఆ పార్టీని లెక్కల్లోకి తీసుకోవడంలేదట బీజేపీ. వైసీపీ మీద మాత్రం బీజేపీ ఓ కన్నేసి వుంచినట్లు తెలుస్తోంది. అవసరమైతే, తెరవెనుకాల సహాయ సహకారాలు అందేలా.. కుదిరితే బీజేపీ ప్రభుత్వంలో వైసీపీ కేంద్రంలో చేరేలా.. ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారట బీజేపీ పెద్దలు.
కానీ, అసలు వాస్తవాన్ని ఏపీ బీజేపీ నేతలు గుర్తించలేకపోతున్నారు. ఇదిలా వుంటే, బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా ఆలోచింస్తోందన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్న వైసీపీ అధినేత, ఆ దిశగా వైసీపీ శ్రేణుల్ని 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే సమాయత్తం చేస్తున్నారట. ప్రత్యేక హోదా అడిగేందుకు సరైన సమయం వస్తోందన్న సంకేతాలు వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకు పంపారని సమాచారం.!