Revanth Reddy : టీఆర్ఎస్ ను పక్కనపెట్టి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫోకస్? హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం కొత్త ఎత్తుగడ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : టీఆర్ఎస్ ను పక్కనపెట్టి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫోకస్? హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం కొత్త ఎత్తుగడ?

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు త్రిముఖ పోటీని తలపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగింది. అయితే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం తామే అని.. ఈ విషయంలో బీజేపీ తమతో పోటీ పడలేదని చెప్పే ప్రయత్నం […]

 Authored By sukanya | The Telugu News | Updated on :4 September 2021,1:30 pm

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు త్రిముఖ పోటీని తలపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగింది. అయితే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం తామే అని.. ఈ విషయంలో బీజేపీ తమతో పోటీ పడలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీ వైపు చూస్తున్న నేతలు, బీజేపీలో కొనసాగుతున్న నేతలను తమ వైపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అప్పటివరకు బీజేపీలోకి వచ్చేందుకు ముందుకొచ్చిన పలువురు నేతలు.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ వైపు చూడటం బీజేపీకి కొత్త సవాల్‌ను తెచ్చిపెట్టింది.ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలు, తమ పార్టీలోకి రావాలనుకున్న నేతలు కాంగ్రెస్‌ వైపు వెళ్లకుండా అడ్డుకోవడంలో బీజేపీ కొంతవరకు సక్సెస్ అయ్యిందనే చర్చ జరుగుతోంది.

revanth reddy

revanth reddy

జంప్ జిలానీలతో చర్చలు Revanth Reddy

దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్, కూల శ్రీశైలం గౌడ్, మూల విక్రమ్ గౌడ్ వంటి కొందరు నాయకులు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. బీజేపీలో కొనసాగుతున్న ఈ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళితే తమకు ఇబ్బందులు తప్పవని భావించిన కమలనాథులు.. వారు అటు వైపు వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. కొందరు ముఖ్యనేతలు రంగంలోకి దిగి వీరితో చర్చలు జరిపారు. వీరిలో కొందరు నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ.. తాము పార్టీ మారడం లేదనే సంకేతాలు ఇచ్చేలా చేశారు కాషాయం నేతలు. ఇప్పటికిప్పుడు పార్టీలోకి కొత్త నేతలు రాకపోయినా.. ఇప్పటికే పార్టీలో చేరిన నాయకులు మళ్లీ వేరే పార్టీలో మారకుండా చూడాలని బీజేపీ నేతలు భావించారు. అలా జరిగితే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఇబ్బందులు రావడంతో పాటు తెలంగాణలో బీజేపీ బలహీనపడుతుందనే సంకేతాలు వెళతాయని అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ వైపు చూస్తారని అనుకున్న నేతలందరినీ కలిసి.. వారు బీజేపీలోనే కొనసాగేలా చేశారని సమాచారం.

ద్విముఖ వ్యూహంలో Revanth Reddy

inugala peddireddy may be Joine congress

inugala peddireddy may be Joine congress

ఈ రకంగా చేయడం ద్వారా తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతలను ఆకర్షించకుండా చేయడంలో బీజేపీ నేతలు చాలావరకు విజయం సాధించారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టడంతో పాటు మరో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతం కాకుండా చూస్తేనే.. బీజేపీ ఇక్కడి రాజకీయాల్లో రాణించగలదని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.జూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం లేదా టీఆర్ఎస్‌కు అక్కడ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని చాటి చెప్పొచ్చని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు నేతలెవరూ ఇతర పార్టీల వైపు చూడకుండా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న కమలనాథులు.. ఈ విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది