Gujarat Election Results 2022 : గుజరాత్ లో ఏడోసారి నెగ్గి సంచలన రికార్డు క్రియేట్ చేసిన బీజేపీ..!!
Gujarat Election Results 2022 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ దాటేయటంతో కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజా విజయంతో వరుసగా గుజరాత్ రాష్ట్రంలో కమలం పార్టీ ఏడుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోయింది. గతంలో కొద్దో గొప్ప పోటీ ఇచ్చిన గాని ఈసారి ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు పోటీ చేయటంతో ఓట్లు భారీగా చీలిపోయాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర కూడా ఏమాత్రం కలిసి రాలేదని తెలుస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ దాటేయటంతో బీజేపీ విజయం దాదాపు ఖరారు అయిపోయింది. మామూలుగా ఏదైనా పార్టీ రెండుసార్లు అధికారంలో ఉంటే మూడోసారి కచ్చితంగా వ్యతిరేకత ప్రజలలో పెరుగుద్ది. కానీ గుజరాత్ రాష్ట్రంలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 1995లో 121 స్థానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ…1998లో 117, 2002లో 127, 2007..లో 117, 2012..లో 115, 2017లో 99 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఏకంగా గత ఎన్నికలకు మించి అత్యధిక స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది. తద్వారా 2002 తర్వాత అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీగా BJP తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని సంచలన రికార్డు క్రియేట్ చేయటానికి కొద్ది అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ఈ విజయంతో గుజరాత్ రాష్ట్రంలో మరోసారి బీజేపీకి తిరుగు లేదని నిరూపించడం జరిగింది.