Janasena : జనసేనలో చేరనున్న మాజీ మంత్రి.. ఆయనొస్తే పవన్ కు చాలా ప్లస్..?
Janasena : ఏపీలో రాజకీయాలన్నీ రోజురోజుకూ మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి ఏపీలో బలంగా ఉన్న పార్టీ అంటే ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. మిగితావన్నీ అట్టట్టే అన్నట్టు ఉన్నాయి. ఏ పార్టీకి సరైన బలం లేదు. ప్రజల్లో నమ్మకం లేదు. టీడీపీ 2019 ఎన్నికల్లో ఓడిపోయి చతికిలపడింది. అలాగే కాంగ్రెస్ అయితే జాడ పత్తా లేకుండా పోయింది. ఇక… జనసేన ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న పార్టీ. బీజేపీ అయితే ఏపీలో పాగా వేయడానికి తీవ్రంగా కష్టపడుతోంది కానీ.. అనుకున్న ఫలితాలు అయితే రావడం లేదు. ఎందుకంటే… ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వల్లనే ఏపీ ప్రజలు బీజేపీ అంటే చాలు మండిపడుతున్నారు.
దీంతో బీజేపీలో ఉన్న నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అందుకే… బీజేపీలో ఉన్న కొందరు కీలక నేతలు జనసేన వైపు చూస్తున్నారట. బీజేపీలో ఉన్న ఓ మాజీ మంత్రి కూడా జనసేన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారట. నిజానికి ఆయన మంచి నేత. ఏపీలో బాగా ఫాలోయింగ్ ఉన్న నేత. ఆయన ఎక్కడుంటే ఆ పార్టీకి కాస్త బలమే. బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో… అదే పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని.. జనసేనలో చేరాలనుకుంటున్నారట.
నిజానికి… జనసేనకు ప్రస్తుతం అటువంటి నాయకులే కావాలి. జనసేనలో సమర్థమైన నాయకుల కొరత చాలా ఉంది. అందుకే… అటువంటి సీనియర్ నేతలు జనసేనలో చేరితే.. పవన్ కళ్యాణ్ కు చాలా ప్లస్. ఆ మాజీ మంత్రి పార్టీలోకి వస్తే.. ఆహ్వానించడాని పవన్ కళ్యాణ్ కూడా రెడీగా ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయదని అంటున్నారు. అందుకే… కలిస్తే ఇక మిగిలిన జనసేనతోనే టీడీపీ కలవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఒకవేళ ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చే చాన్సెస్ ఉన్నాయి కాబట్టి…. ముందే జనసేనలో చేరడం బెటర్ అని ఆ నేత అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
Janasena : త్వరలోనే పవన్ దీనిపై ప్రకటన చేసే అవకాశం
అందుకే… పవన్ కళ్యాణ్ త్వరలో ఆ నేత పార్టీలో చేరే విషయమై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆనేతతో పాటు మరో మాజీ మంత్రి కూడా పార్టీ మారుతారట. అందుకే ఇద్దరినీ ఒకేసారి జనసేనలో చేర్చుకొని ఏపీ రాజకీయాలనే మార్చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… ఓవైపు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలోకి వెళ్లకుండా… ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న పార్టీ జనసేన వైపు చాలామంది సీనియర్ నేతలు చూస్తుండటం.. నిజంగానే జనసేనకు మంచి పరిణామం.