DK Aruna : బాగా హుషారు అయినవనే కదా నిన్ను కేసీఆర్ పక్కన పెట్టింది.. హరీశ్ రావుపై డీకే అరుణ ఫైర్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

DK Aruna : బాగా హుషారు అయినవనే కదా నిన్ను కేసీఆర్ పక్కన పెట్టింది.. హరీశ్ రావుపై డీకే అరుణ ఫైర్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 March 2021,8:32 pm

DK Aruna : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన అరుణ… ఈ సందర్భంగా హరీశ్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. హరీశ్ రావును ఎందుకు పక్కన పెట్టారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని దుయ్యబట్టారు.. హరీశ్ రావు బాగా హుషార్ అయిండు.. అందుకే ఆయన్ను కేసీఆర్ పక్కన పెట్టిండు. ఆ విషయాన్ని హరీశ్ రావు మరిచిపోతే ఎట్లా.. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారం చెబుతావా? తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించిన హరీశ్ రావు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. అని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Bjp leader dk aruna fires on minister harish rao

Bjp leader dk aruna fires on minister harish rao

DK Aruna : హరీశ్ రావుపై పరుష పదజాలం ఉపయోగించిన అరుణ

హరీశ్ రావుపై డీకే అరుణ పరుష పదజాలం ఉపయోగించారు. హరీశ్ రావుకు సిగ్గుందా? అంటూ అరుణ తిట్టారు. అసెంబ్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై అబద్ధాలు చెబుతావా? ఒకవైపు నువ్వు, నీ మామ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే…. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ కాపాడుతోంది. అలాంటి పార్టీపై విమర్శలు చేసేంత అధికారం నీకెవరిచ్చారు. మీ బండారం తెలంగాణ ప్రజలకు తెలియదనుకుంటున్నావా? బండి సంజయ్ ని విమర్శించే హక్కు నీకు లేదు. అసలు.. కేంద్రానికి బండి సంజయ్ ఏ లేఖ రాశారో నీకు తెలుసా? ఆయన రాసిన లేఖలో ఏముందో నువ్వు చదివావా? అంటూ అరుణ ప్రశ్నించారు.

తెలంగాణపై భక్తి మీకు కాదు.. మాకు ఉంది. ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల ప్రజల సొమ్మును మీరు దోచుకుంటుంటే మేము ప్రశ్నించకూడదా? తొందరలోనే మీరు జైలుకు వెళ్లే రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రిని బీజేపీ అస్సలు వదిలిపెట్టదు. మీ అవినీతి అంతా త్వరలోనే బయటికి వస్తుంది.. అని డీకే అరుణ స్పష్టం చేశారు.

DK Aruna : సంగమేశ్వర ప్రాజెక్టును అక్రమంగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంటే… బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు

తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా… ఏపీ ప్రభుత్వం సంగమేశ్వర ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తుంటే.. బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు. అది కూడా తప్పేనా? ఆ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తే.. తెలంగాణకు వచ్చే నీళ్లు ఆగిపోతాయి. ఆమాత్రం మీకు తెలియదా? మీరెందుకు ఆ ప్రాజెక్టును ఆపాలని ప్రయత్నించలేదు. ఎందుకు ప్రాజెక్టును ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. కేసీఆర్ ఎందుకు సంగమేశ్వర ప్రాజెక్టు విషయంలో మౌనంగా ఉన్నారు. ఎందరో అమరవీరులైతే తెలంగాణ వచ్చింది. కానీ.. అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను జగన్ కాళ్ల వద్ద పెట్టారు కేసీఆర్. కేంద్రానికి ఇప్పటి వరకు సమర్పించాల్సిన డీపీఆర్ లను ఇవ్వలేదు. అపెక్స్ కౌన్సిల్ లో మాత్రం డీపీఆర్ ఇస్తామని ఒప్పుకొని… ఇప్పుడు మాత్రం డీపీఆర్ ను ఇవ్వడం లేదు. మీ బండారం బయటపడుతుందనే కదా… డీపీఆర్ ను ఇవ్వడం లేదు. మీరు తప్పు చేయకుంటే వెంటనే డీపీఆర్ ను కేంద్రానికి సమర్పించండి. అప్పుడు మీ అవినీతి మొత్తం బయటపడుతుంది. అప్పుడు తెలంగాణ ప్రజలే మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమేస్తరు… అంటూ డీకే అరుణ కాస్త ఘాటుగానే హరీశ్ రావును విమర్శించారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది