ఏపీ బీజేపీ కీల‌క నేత‌ చూపు వైసీపీ వైపు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఏపీ బీజేపీ కీల‌క నేత‌ చూపు వైసీపీ వైపు..?

 Authored By sukanya | The Telugu News | Updated on :5 July 2021,11:15 am

ratnaprabha తిరుపతి బై పోల్ తర్వాత బీజేపీలోకి వలసల వరద ఉంటుందని ఆ పార్టీ ఢంకా భజాయించింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందట. ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నా.. కాషాయ దళానికి రివర్స్ ఎటాక్ తప్పేలా లేదు. అధికార పార్టీ నేతలు పక్క చూపులు చూడకపోయినా.. టీడీపీ నేతలు కచ్చితంగా బీజేపీలోకి చేరుతారని.. భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు ఆశించారు. టీడీపీ నేతలు బీజేపీలో చేరడం సంగతి అటుంచితే.. కీలక బీజేపీ నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ఆ పార్టీని కలవర పెడుతోంది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ మారనున్నారన్న టాక్ రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి తగ్గట్లు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఆమె కనీసంగా కూడా కనిపించకపోవడంతో, ఈ టాక్ మరింత పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.

bjp Leader ratnaprabha May be joine in Ysrcp

bjp Leader ratnaprabha May be joine in Ysrcp

బీజేపీలో ఉంటూ వైఎస్ఆర్, జగన్ పై పొగడ్తలు ratnaprabha

రత్న ప్రభ విషయానికి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, సీఎం వైఎస్ జగన్ కు ఈ మాజీ సివిల్ సర్వెంట్ అభిమాని అని అందరికీ తెలిసిందే. బీజేపీలో జాయిన్ అయినప్పటికీ వీరి పైనే పొగడ్తలు కురిపించారు. ఈ కారణంగానే ఆమె చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. 2019లో కా‌షాయ కండువా కప్పుకున్నారు రత్న ప్రభ. అయితే ఆమె తనపై వస్తున్న రూమర్లను సోషల్ మీడియా ద్వారా ఖండించారు. ఇటీవల తాను పార్టీ మారుతున్నట్టు, వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. కానీ ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు.. అవన్నీ తన ప్రతిష్టను, బీజేపీపై తనకు ఉన్న విధేయతను దెబ్బ తీయడానికి తప్పుడు ప్రచారాలు మాత్రమే అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అనుసరిస్తున్న ఆదర్శాల నుండి ప్రేరణ పొందిన తాను రాజకీయాల్లోకి అడుపెట్టానని. ఎప్పటికీ బీజేపీలోనే కొనసాగుతాను అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

bjp Leader ratnaprabha May be joine in Ysrcp

bjp Leader ratnaprabha May be joine in Ysrcp

జనసేనకు చిక్కులేనా.. bjp Leader ratnaprabha

ఆమె సోషల్ మీడియాలో వివరణ ఇచ్చినా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. ప్రతీ ప్రజాప్రతినిధి అలాగే అంటారని.. పార్టీ మారే వరకు ఇదే మాటు చెబుతారని.. కానీ చివరిలో ప్లేటు ఫిరాయిస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇటు వైసీపీ వర్గాలు సైతం ఆమె త్వరలోనే కండువా మార్చడం పక్కా అంటున్నారు. ఇతర బీజేపీ నేతలు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు.. ఇదిలా ఉంటే, ఈ ప్రచారం .. జనసేనకు సైతం షాకివ్వనుందని తెలుస్తోంది. ఒకవేళ ఆమె గనుక వైసీపీలోకి వెళితే, పవన్ కు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన సోదరి అంటూ తిరుపతి బైపోల్ లో పవన్ చెప్పడంతో, ఆమె పార్టీ మారితే, పవన్ పై విమర్శలు తప్పవని అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> జ‌గ‌న్ ను డీ కొట్ట‌డానికి టీడీపీ భారీ ప్లాన్‌.. పీకే టీమ్‌తో నారా లోకేష్…!

ఇది కూడా చ‌ద‌వండి ==> జనసేనాని మౌనాన్ని వీడే దారేది.. పార్టీని బీజేపీలో కలిపేసి సినిమాల్లో బిజీ అయిపోయారా?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏమైందమ్మా షర్మిలమ్మ.. ఇదేనా నీ రాజన్న రాజ్యం.. పార్టీ పెట్టకముందే షర్మిలకు భారీ షాక్?

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది