జగన్ ను డీ కొట్టడానికి టీడీపీ భారీ ప్లాన్.. పీకే టీమ్‌తో నారా లోకేష్…!
Nara lokesh : తాము ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్న అనే ట్యాగ్ లైన్లు తగిలించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో మరో కొత్త అన్న పేరుగా వినిపిస్తోంది ..ఆయనే లోకేషన్న. 2024 ఎన్నికలే లక్ష్యంగా లోకేష్ సిధ్దమవుతున్నారు. అందులోభాగంగానే ప్రజల్లో నానేందుకు ఇప్పుడు టీడీపీ లోకేష్ ను లోకేషన్నగా Nara lokesh ప్రోజెక్ట్ చేసే పనిలో పడింది. తాజాగా ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీం ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ టీంలో పీకేతో కలిసిపనిచేసిన వారు ఉన్నట్లు తాజా సమాచారం. ఆ టీమ్ రూపొందించిన ఈ కొత్త నేమ్ ను ఇప్పుడు విరివిగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ ను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపోందిస్తున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ కారణంగా రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దు కోసం లోకేష్ ఏపీ ముఖ్యమంత్రికి జగన్ కు లేఖ రాశారు. జూమ్ మీటింగ్ లో ప్రత్యేకంగా విద్యార్థులతోనూ భేటీ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఏపీ సర్కార్ పరీక్షల్ని రద్దు చేసింది.

Nara lokesh work with PK Team
పదో తరగతి పరీక్షల రద్దుతో .. Nara lokesh
అయితే లోకేష్ నిర్వహించిన మొత్తం ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడంతో లోకేష్ డిమాండ్ వల్లే జగన్ వెనక్కి తగ్గారంటూ టీడీపీ సోషల్ మీడియా టీమ్ విసృతంగా ప్రచారం చేసింది. అయితే ఈ ప్రమోషన్స్ లో థాంక్యూ లోకేష్ అన్న అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోకేష్ Nara lokesh ను కూడా అన్న గా ప్రయోట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా అటు పార్టీ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తోంది. 2024 ఎన్నికల నాటికి నారా లోకేష్… జగన్ ను డీ కొట్టే స్థాయిలో ఉంటారా…? అనేది ఇప్పటి నుంచే బేరీజు వేసుకుంటున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లోకేష్ ను భవిష్యత్తు నేతగా ప్రమోట్ చేయడానికే చంద్రబాబు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే అదే స్థాయిలో లోకేష్ కూడా సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే తెలుగుపై పట్టు సాధించి గతంలో మాదిరిగా తడబడకుండా ఇప్పుడు ప్రతీ మాట సూటీగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నే టార్గెట్ చేస్తూ పదునైన వ్యాఖ్యలతో లోకేష్ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

tdp
చినబాబుపై పార్టీలో అసంతృప్తి..? Nara lokesh
అయితే ప్రస్తుతం ఏపీలో లోకేష్ కోసం చేస్తున్న ఈ కొత్త ప్రమోషన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందోనని సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. అదే సమయంలో పార్టీ నేతల నుంచి లోకేష్ పట్ల వెల్లువెత్తుతోన్న నిరసనలపై ఏం చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొందరు లీడర్లు బహిరంగంగానే జూనియర్ ఎన్టీయార్ రావాలంటుండడంతో, చంద్రబాబుకు టెన్షన్ మొదలైంది.

Jr Ntr Comments on Political entry in evaru meelo kotishwarulu
ఈ నేపథ్యంలో చినబాబు ఎంతమేరకు నిలబడతారో.. పార్టీని ముందుకు తీసుకెళతారోనని నేతల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొన్నిచోట్ల కేడర్ సైతం బహిరంగంగానే జూనియర్ ఎన్టీయార్ కోసం డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు తన రాకకు ఇంకా టైం ఉందంటూ జూనియర్ ఎన్టీయార్ చెప్పడంతో.. ఈలోపే చినబాబును ప్రమోట్ చేయాలని, పగ్గాలు అప్పగించాలని బాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తుండడంతో, ఇది ఎంతమేరకు కలిసివస్తుందోనని చర్చలు సాగుతున్నాయి.