KTR : కేటీఆర్ ఇలాంటి ట్వీట్ చేస్తారనుకోలేదు.. చాలా బాధేసింది… మండిపడ్డ ఎమ్మెల్యే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : కేటీఆర్ ఇలాంటి ట్వీట్ చేస్తారనుకోలేదు.. చాలా బాధేసింది… మండిపడ్డ ఎమ్మెల్యే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 April 2021,7:00 am

KTR : ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. చాప కింద నీరులా కరోనా తీవ్ర స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఎక్కడ చూసినా కరోనానే. ఏ ఆసుపత్రిలో చూసిన కరోనా పేషెంట్లే. బెడ్లు లేవు… వెంటిలేటర్లు లేవు.. ఆక్సీజన్ కొరత కూడా విపరీతంగా ఉంది. కరోనా తీవ్రస్థాయిలో తన పంజాను విసరడంతో ఏం చేయాలో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా… కరోనా నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. కరోనా కాటుకు రోజూ వందల సంఖ్యలో బలవుతూనే ఉన్నారు. రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. కానీ… వేల మందికి కరోనా సోకుతుండటంతో ప్రభుత్వం కూడా ఏం చేయలేని నిస్సాయక స్థితిలో ఉంది.

bjp mla raja singh on ktr tweet over corona vaccine prices

bjp mla raja singh on ktr tweet over corona vaccine prices

రాష్ట్రంలో కరోనాను నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు.. కరోనా విషయంలో మంత్రులు మాట్లాడుతున్న తీరు అయితే చాలా బాధాకరంగా ఉంటోందని రాజాసింగ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి… ప్రజలను ఆదుకోవాల్సింది పోయి… కరోనాపై కూడా రాజకీయాలు చేయడం దారుణం అని రాజాసింగ్ అన్నారు.

bjp mla raja singh on ktr tweet over corona vaccine prices

bjp mla raja singh on ktr tweet over corona vaccine prices

KTR : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు?

కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాజాసింగ్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని కేంద్రంపై మోపిందని… కేంద్రంపై తోసేసి… తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వ్యాక్సిన్ ధరల విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ బాధ్యతారాహిత్యంగా ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. 45 సంవత్సరాలు పైబడిన వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా అందిస్తోందని…. కేంద్రం గైడ్ లైన్స్ రాకముందే… ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది