KCR : కేసీఆర్ కు బీజేపీ రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే అలా ఇరికించడమేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ కు బీజేపీ రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే అలా ఇరికించడమేనా?

 Authored By himanshi | The Telugu News | Updated on :7 February 2022,12:00 pm

KCR  : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పర్యటనకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా సీఎం కేసీఆర్ జ్వరం అంటూ సిల్లీ రీజన్ చెప్పడం పై బిజెపి నాయకులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను ఏ విధంగా టార్గెట్ చేయాలని ఎదురు చూస్తున్న బిజెపి నాయకులు ఇపుడు ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని అంత సులభంగా విడువకుండా కేసీఆర్ ను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో బిజెపి నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

అందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియా ద్వారా బిజెపి నాయకులు సీఎం కేసీఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీని హెచ్చరించినట్లు తెలిసింది. సోషల్ మీడియా లో తాజాగా బిజెపి వారు కచ్చితంగా కేసీఆర్ కి
రిటర్న గిఫ్ట్‌ భారీగానే ఉంటుంది అని ప్రకటించారు. బిజెపి రిటర్న్ గిఫ్ట్ అంటే అది సీరియస్ గానే ఉంటుంది అంటూ జాతీయ రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏదైనా సాధ్యమే.. కేంద్ర ప్రభుత్వం తో పెట్టుకుంటే ఏం చేసేందుకు అయినా సిద్దమే అన్నట్లుగా బీజేపీ ఉంటుంది అనడంలో సందేహం లేదు. బీజేపీ ప్రత్యర్థి ముఖ్యమంత్రి అయినా మరెవరైనా తాము తలుచుకుంటే ఏం చేసేందుకైనా సిద్ధమైనట్లు గా వ్యవహరిస్తారని ప్రచారం ఉంది.

bjp telangana leaders return gitf for cm kcr

bjp telangana leaders return gitf for cm kcr

కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ముందస్తుగా ఊహించకుండా కేసీఆర్ ఈ పని చేసి ఉండరు. ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కనుక బిజెపి ఏమి చేసినా సిద్ధంగా ఉండే ఆయన ఈ పని చేసి ఉంటారని కొందరు నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ప్రకటించడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ మరియు బిజెపి ల మధ్య జరుగుతున్న వైరంను కాంగ్రెస్ పార్టీ అలా చూస్తూ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రధాని మోడీ మరియు కేసీఆర్ ల మధ్య ఈప్రోటోకాల్ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది