BJP – TRS : టీఆర్ఎస్, బీజేపీ.. దాడుల రాజకీయం ఎవరిది.?
BJP – TRS : ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటుండకూడదు. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాజకీయ నాయకులపై దాడులు జరుగుతుంటాయి. అలా దాడులు చేసేవాళ్ళు సామాన్యులేనని కొందరు వాదిస్తుంటారు.. అది రాజకీయ దాడి అని మరికొందరు అంటుంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతల మీద దాడులు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయి. మొన్నామధ్య ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీద కూడా దాడి జరిగింది. అసలు ఈ దాడుల వెనుక వుండేదెవరు.? పబ్లిసిటీ కోసం ఇలాంటి దాడులు చేస్తుంటారా.? రాజకీయ ప్రేరేపిత దాడులా.? ప్రజలు, నాయకుల మీద దాడులు చేసే పరిస్థితి వుండదు.
వుంటే, ఏ రాజకీయ నాయకుడు కూడా రోడ్ల మీద తిరగడన్నది ప్రజాస్వామ్యవాదులు చెప్పేమాట. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద దాడి జరిగింది. నియోజకవర్గంలో వదరల పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన వెళ్ళగా, కొందరు ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం సహా, ఆయన వెంట వచ్చిన పలు వాహనాలపై దాడులు చేశారు. ఈ దాడులపై బీజేపీ నేతలు గుస్సా అయ్యారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర సమితి నడుపుతున్న దాడుల డ్రామా..
అన్నది బీజేపీ ఆరోపణ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై స్పందించారనీ, ధర్మపురి అరవింద్‌తో మాట్లాడారనీ బీజేపీ చెబుతోంది. అస్సలేమాత్రం తగ్గొద్దని బీజేపీ అధినాయకత్వం, బీజేపీ తెలంగాణ నేతలకు సూచించిందట. గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా దాడి యత్నాలు జరిగాయి. వీటిని తెలంగాణ రాష్ట్ర సమితి చేయిస్తోందని కమల నాథులు ఆరోపిస్తోంటే, ప్రజలే నిలదీస్తున్నారని గులాబీ పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. ఏది నిజం.? అన్నది ఆ పైవాడికే ఎరుక. కానీ, ఈ దాడుల రాజకీయం మాత్రం సబబు కాదు.