Eggs | బరువు తగ్గాలనుకునేవారికి గుడ్లు బెస్టు ఎంపిక.. ఉడికించాలా? లేక వేయించాలా?
Eggs | ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారి ఆహార పట్టికలో గుడ్లు ముఖ్యమైన భాగంగా మారాయి. గుడ్లను ఉడికించాలి? లేక వేయించాలి? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం, ఒక ఉడికించిన గుడ్డులో సుమారు 70-80 కేలరీలు మాత్రమే ఉంటాయి. నూనె, వెన్న వాడకుండా ఉడికించవచ్చును కాబట్టి ఇది తక్కువ కేలరీల ఆప్షన్. అయితే వేయించిన గుడ్ల విషయంలో నూనె లేదా వెన్న వాడటం వల్ల కేలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

#image_title
ప్రోటీన్ పరంగా రెండూ సమానం
గుడ్లు ఏ రూపంలో తిన్నా అందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ మారదు. ఇది శరీరానికి కావలసిన ప్రోటీన్‌ను అందించడంలో సమానంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఉడికించిన గుడ్లు, వేయించిన గుడ్లు రెండూ మంచి ఎంపికలే. ఉడికించిన గుడ్లను ఎక్కువసేపు అధిక ఉష్ణోగ్రతలో ఉంచితే కొన్ని సూక్ష్మపోషకాలు నశించే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా వేయించినప్పుడు అధిక వేడి వల్ల గుడ్లలోని కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెందే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
అందువల్ల తక్కువ వేడిలో, మితంగా వండడం మంచిదని నిపుణుల సూచన.గుడ్లు వేయించాలంటే ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెల్లో, తక్కువ పరిమాణంలో వేయించాలి. ఎక్కువ నూనె, వెన్న వాడటం వల్ల కేలరీలు అధికమవుతాయి.