Botsa satyanarayana comments on three capitals
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ఆర్‌సీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అభివృద్దే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని 99 శాతం పూర్తి చేసున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇవ్వని 40 హామీలను కూడా సీఎం జగన్ నెరవేర్చారని బొత్స ఈసందర్భంగా స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు.
ఇంకా మా ప్రభుత్వానికి మూడు సంవత్సరాల సమయం ఉంది. దాని కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకుంటూ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుంది… అని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రం సమగ్రాభివృద్దిగా ఎన్నడూ చూడని సంక్షేమ పాలనను ఏపీ ప్రజలకు సీఎం జగన్ దగ్గర చేశారు. మా ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమంపై ఒక పుస్తక రూపం చేసి ప్రతి ఇంటికీ పంపిస్తాం.. అని బొత్స హామీ ఇచ్చారు.
Botsa satyanarayana comments on three capitals
బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంపై మరోసారి ప్రస్తావిస్తూ.. మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తాం అన్నారు. అంతేకాదు.. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా, అవినీతి , అక్రమ నిర్మూలనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన ఉంటుందని ఆయన తెలిపారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లలాగా తమ ప్రభుత్వం బావిస్తుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు లేకుండా లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలి చేశామని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. రెండేళ్లుగా తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారని బొత్స ఆనందం వ్యక్తం చేశారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.