కేబినెట్ విస్త‌ర‌ణ‌… 2024 ఎన్నికలకు జగన్ నయా స్కెచ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

కేబినెట్ విస్త‌ర‌ణ‌… 2024 ఎన్నికలకు జగన్ నయా స్కెచ్…!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయింది. అంటే.. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ప్రజాపాలనలో రెండేళ్లు గడిచిపోయింది. ఇకనుంచి వచ్చే మూడేళ్లు కూడా ప్రభుత్వం, పార్టీపరంగా చాలా కీలకమైన దశలోకి ప్రవేశిస్తున్నట్టే. కారణం.. 2024లో ఎన్నికలు ఉన్నాయి. మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. తన మార్క్, పొలిటికల్ చార్మ్ మళ్లీ ప్రజలకు తెలియాలి. అంటే.. తనతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తల పనితీరును […]

 Authored By uday | The Telugu News | Updated on :30 May 2021,5:10 pm

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయింది. అంటే.. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ప్రజాపాలనలో రెండేళ్లు గడిచిపోయింది. ఇకనుంచి వచ్చే మూడేళ్లు కూడా ప్రభుత్వం, పార్టీపరంగా చాలా కీలకమైన దశలోకి ప్రవేశిస్తున్నట్టే. కారణం.. 2024లో ఎన్నికలు ఉన్నాయి. మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. తన మార్క్, పొలిటికల్ చార్మ్ మళ్లీ ప్రజలకు తెలియాలి. అంటే.. తనతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తల పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ ఓట్లు వేయించుకోగలగాలి. ఇందుకు జగన్ పెద్ద కసరత్తే చేయాలి. అయితే.. పాలనతోపాటు పార్టీపై కూడా జగన్ ఓ కన్నేశారని.. నాయకుల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సమాచారం.

Ys Jagan : జగన్ కేబినెట్ అంతా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా..

జగన్ కేబినెట్ అంతా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. కొందరు సీనియర్లు.. యాభైల్లో ఉన్నవారైనా రాజకీయంగా మంచి వయసే. జగన్ కూడా నలభై ప్లస్ లో ఉన్నారు. ఇవన్నీ ప్రజలను ఆకట్టుకునే అంశాలే. తమను పాలించే నాయకులు కొత్తగా, ఎనర్జిటిగ్గా ఉంటే ప్రజలకు కూడా కిక్కే. 2019లో జగన్ గెలుపుకు ఇదొక స్ట్రాటజీ. ప్రస్తుత పాలన కూడా అలానే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును కూడా జగన్ కేటగిరీలుగా విభజిస్తున్నారట. ప్రజల్లో ఉంటోంది ఎవరు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోందెవరు.. పార్టీని ప్రజల్లో నిలుపుతోంది ఎవరు.. అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారట. ఈ ప్రాతిపదికనే మిగిలిన మూడేళ్లు కూడా పరిశీలించి 2024 ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.

ys jagan target 2024

ys jagan target 2024

మంత్రివర్గంలో కూడా జగన్ మార్పులు చేస్తారు. రెండేళ్ల క్రితమే ఈ విషయం చెప్పేశారు. కొందరిని మొదట్లో పదవులిచ్చి సంతృప్తి పరచి.. తనను నమ్మినవారు.. మరింత కేపబిలిటీ ఉన్నవారికి మలివిడతలో పదవులిచ్చి వారితోనే ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ప్లాన్ గా చెప్తున్నారు. ఈక్రమంలో ప్రజలకు మళ్లీ వైసీపీ కొత్తగా కనిపించేలా సరికొత్త కూర్పు ఉంటుందని అంటున్నారు. ఈక్రమంలో 100 2024 ఎన్నికల్లో టక్కెట్లు ఇవ్వడం కష్టమే అంటున్నారు. ప్రజలను ఆకర్షించిన ‘కొత్త’ అనే మంత్రంతోనే వెళ్తారట. టీడీపీలో కొత్తవారిని చంద్రబాబు ఆదరించడమే తక్కువ. దశాబ్దాల నాటి నాయకులతోనే ఆ పార్టీ ఉంది. ఈ అంశం కూడా జనం తనను మళ్లీ ఆదరించేలా చేస్తుందని జగన్ నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. మరి.. జగన్ ఆలోచనేంటో.. ఇందులో నిజమెంతుందో చూడాల్సి ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి==> YSRCP : వైసీపీలోకి కాంగ్రెస్ కీల‌క నేత‌…?

ఇది కూడా చ‌ద‌వండి==> 2024 లక్ష్యంగా జగన్ దూకుడు.. ఆ నియోజకవర్గాలే ప్రధాన టార్గెట్ !

ఇది కూడా చ‌ద‌వండి==> AP Cabinet : ఎవ్వరూ ఊహించని ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వనున్న సీఎం జగన్?

ఇది కూడా చ‌ద‌వండి==> Roja : రోజా జబర్దస్త్ మాట‌లు… ఆమె మాటలకు చిర్రెత్తుకొచ్చిన జగన్ ఏం చేశారంటే..?

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది