మూడు రాజ‌ధానుల‌పై మ‌రోసారి బొత్స‌ సంచ‌ల‌న వ్యాఖ‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మూడు రాజ‌ధానుల‌పై మ‌రోసారి బొత్స‌ సంచ‌ల‌న వ్యాఖ‌లు

 Authored By uday | The Telugu News | Updated on :31 May 2021,1:20 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ ఆర్‌సీపీ ప్ర‌భుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జ‌గ‌న్ అభివృద్దే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌తి అంశాన్ని 99 శాతం పూర్తి చేసున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇవ్వని 40 హామీల‌ను కూడా సీఎం జ‌గ‌న్ నెర‌వేర్చార‌ని బొత్స ఈసందర్భంగా స్పష్టం చేశారు. అన్ని వ‌ర్గాల సంక్షేమం కోసం తమ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

మా ప్ర‌భుత్వం సంక్షేమమే లక్ష్యంగా… : బొత్స‌

ఇంకా మా ప్రభుత్వానికి మూడు సంవ‌త్స‌రాల సమయం ఉంది. దాని కోసం దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు చేసుకుంటూ ప్రభుత్వం మ‌రింత ముందుకు వెళ్తుంది… అని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండేళ్ల‌లో రాష్ట్రం స‌మ‌గ్రాభివృద్దిగా ఎన్న‌డూ చూడ‌ని సంక్షేమ పాల‌నను ఏపీ ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గన్ దగ్గర చేశారు. మా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అందించిన సంక్షేమంపై ఒక పుస్త‌క రూపం చేసి ప్ర‌తి ఇంటికీ పంపిస్తాం.. అని బొత్స హామీ ఇచ్చారు.

Botsa satyanarayana comments on three capitals

Botsa satyanarayana comments on three capitals

బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మూడు రాజ‌ధానుల విష‌యంపై మ‌రోసారి ప్రస్తావిస్తూ.. మూడు రాజ‌ధానుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఏర్పాటు చేస్తాం అన్నారు. అంతేకాదు.. ప్ర‌తీ పేద‌వాడికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందేలా, అవినీతి , అక్ర‌మ నిర్మూల‌నే ల‌క్ష్యంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌రిపాల‌న ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. సంక్షేమం, అభివృద్ది రెండు క‌ళ్లలాగా తమ ప్ర‌భుత్వం బావిస్తుంద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. అవినీతి, అక్ర‌మాలు లేకుండా ల‌బ్దిదారుల‌కు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి న‌గ‌దు బ‌దిలి చేశామ‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పుకొచ్చారు. రెండేళ్లుగా తమ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నార‌ని బొత్స ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

    uday

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది