Stroke | స్ట్రోక్ ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు .. సమయానికి గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Stroke | స్ట్రోక్ ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు .. సమయానికి గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

 Authored By sandeep | The Telugu News | Updated on :20 September 2025,8:00 am

Stroke | మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల కలిగే బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఒక్కసారిగా వచ్చే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం, మాటలు పడిపోవడం, ప్రాణాపాయం వంటి తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్ లక్షణాలను త్వరగా గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు.

#image_title

ప్రారంభ లక్షణాలు ఇవే

* ముఖం వంకరగా మారడం : చిరునవ్వు న‌వ్వగానే ముఖం ఒక వైపు వంకరగా కనిపించడం.
* చేతులు, కాళ్లలో తిమ్మిరి : శరీరం ఒక వైపు అకస్మాత్తుగా బలహీనంగా మారడం.
* కళ్ళు మసకబారడం : ఒక్కసారిగా దృష్టి మసకబారడం, రెండుగా కనిపించడం.
* తల తిరగడం : కారణం లేకుండా తల తిరగడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం.

గుర్తించడానికి సులభమైన పద్ధతి – F.A.S.T

* F (Face) – నవ్వినప్పుడు ముఖం వంకరగా ఉందా చూడాలి.
* * A (Arm) – రెండు చేతులు పైకెత్తమని చెప్పాలి. ఒక చేయి కిందపడితే జాగ్రత్త.
* S (Speech) – మాట్లాడినప్పుడు మాట నత్తిగా ఉందా గమనించాలి.
* T (Time) – ఈ లక్షణాల్లో ఏదైనా కనబడితే ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

నివారణ మార్గాలు

* రక్తపోటు, షుగర్ ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.
* ధూమపానం, మద్యం మానేయాలి.
* సుస్థిరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం అలవాటు చేసుకోవాలి.
* సరైన నిద్ర తీసుకోవాలి.
* గుండె, కొలెస్ట్రాల్ పరీక్షలు నిరంతరం చేయించుకోవాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది