Brain | నిద్ర తగ్గితే మెదడు వేగంగా ముసలిదైపోతుంది.. 27,000 మందిపై సంచలన అధ్యయనం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brain | నిద్ర తగ్గితే మెదడు వేగంగా ముసలిదైపోతుంది.. 27,000 మందిపై సంచలన అధ్యయనం

 Authored By sandeep | The Telugu News | Updated on :7 October 2025,7:00 am

Brain | మనలో చాలామంది నిద్రను అలసత్వంగా భావిస్తారు. కానీ నిజానికి అది మెదడుకు ‘ఛార్జింగ్‌’ టైమ్. బ్రిటన్‌లో 27,000 మందిపై నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం మరోసారి రుజువైంది. యూకే శాస్త్రవేత్తలు 40 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల 27 వేల మందిపై నిద్ర అలవాట్లు, మెదడు స్కానింగ్‌లను విశ్లేషించారు. ఫలితంగా, సరిగా నిద్రపోని వారి మెదడు వారి అసలైన వయస్సు కంటే 2-3 ఏళ్ల ముందు వృద్ధాప్యంలోకి చేరుతున్నట్టు తేలింది.

#image_title

మెదడు వయస్సు ఎలా కొలుస్తారు?

ఒక శరీరం ముసలితనాన్ని తేలికగా గుర్తించొచ్చు . కానీ మెదడులో మార్పులు కనిపెట్టడం సవాలే. అయితే తాజా టెక్నాలజీ సహాయంతో శాస్త్రవేత్తలు మెదడులో కణాల సాంద్రత, రక్తనాళాల ఆరోగ్యం వంటి అంశాలను అధ్యయనం చేసి, మెదడు “వాస్తవ వయస్సు” ఎంత ఉందో తెలుసుకున్నారు.

నిద్ర లోపం వల్ల కలిగే సమస్యలు:

మెదడు చురుకుతనం తగ్గిపోవడం

మతిమరుపు, డిమెన్షియా వచ్చే అవకాశాలు పెరగడం

రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గిపోవడం

శరీరంలోని వాపు స్థాయిలు (Inflammation) పెరగడం

మీ నిద్ర నాణ్యతను పెంచే 3 చిట్కాలు:

-పడుకునే 1 గంట ముందు కాఫీ, టీ, ఆల్కహాల్ తీసుకోకండి. మొబైల్ ఫోన్ స్క్రీన్‌కు దూరంగా ఉండండి.

– చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచుకోండి. గది ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి.

– ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేచే అలవాటు వేసుకోండి. ఇది మీ నిద్ర రిథంను సరిచేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది