Brain Stroke | బ్రెయిన్ స్ట్రోక్‌కి దూరంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Brain Stroke | బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి వయసు, లింగం, జన్యుశాస్త్రం వంటి నియంత్రణకు మించిన అంశాలు కారణమవుతాయి. అయితే, సరైన జీవనశైలి పాటిస్తే ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని న్యూరాలజిస్టు డాక్టర్ తుషార్ కౌర్ సూచిస్తున్నారు. ఆయన ప్రకారం, ముందుగానే కొన్ని అలవాట్లు మార్చుకుంటే స్ట్రోక్‌ను నివారించడం మాత్రమే కాకుండా, వచ్చినా కూడా నియంత్రించవచ్చని చెబుతున్నారు.
#image_title
హెల్దీ డైట్
స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి బ్యాలెన్స్‌డ్ డైట్ చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలని WHO సూచిస్తోంది. అలాగే సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయల వంటి పదార్థాలను కూడా మితంగా తీసుకోవడం మంచిది.
వర్కౌట్ తప్పనిసరి
ప్రతి వారం కనీసం 150 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం చేయడం అవసరం. వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత వంటివి రక్తప్రసరణను మెరుగుపరచడమే కాకుండా బీపీని నియంత్రించడంలోనూ సహాయపడతాయి.
హెల్దీ వెయిట్
అధిక బరువు కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి సరైన ఆహారం, వ్యాయామంతో బరువును నియంత్రించడం అత్యంత అవసరం.
షుగర్, బీపీ కంట్రోల్
కంట్రోల్‌లో లేని డయాబెటిస్ మరియు హై బ్లడ్ ప్రెజర్ స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు. క్రమం తప్పకుండా షుగర్ లెవల్స్, బీపీని చెక్ చేసుకోవాలి. అవసరమైతే వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ తీసుకోవాలి.