Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా ఇప్పుడు బ్రౌన్ రైస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ మార్పు వాస్తవంగా ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగకరమో తెలుసుకోవడం అవసరం.
 
#image_title
చాలా ఉపయోగం..
నిపుణుల ప్రకారం, బ్రౌన్ రైస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో ఆకలి తక్కువగా వేసి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
ఇక మధుమేహం ఉన్నవారికి బ్రౌన్ రైస్ ఎంతో ప్రయోజనకరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. తెల్ల బియ్యం లాగానే వెంటనే గ్లూకోజ్ పెంచకపోవడం దీని ప్రత్యేకత. బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. తెల్ల బియ్యం ప్రాసెసింగ్‌లో ఈ పోషకాలు ఎక్కువగా పోతాయి. అదనంగా, బ్రౌన్ రైస్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
 
 
                               
                       
                       
                     
                     
 
 
 
 
 
 
