BRS Membership : ఏపీ లో BRS సభ్యత్వం తీసుకుంటే కే‌సీఆర్ బంపర్ ఆఫర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BRS Membership : ఏపీ లో BRS సభ్యత్వం తీసుకుంటే కే‌సీఆర్ బంపర్ ఆఫర్..!

BRS Membership : బీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి. ఈ పార్టీ ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే కాదు.. యావత్ దేశమంతా విస్తరించింది. ఇప్పటికే తెలంగాణకు బార్డర్ గా ఉన్న కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. ఆ రాష్ట్రాల్లో పార్టీని యాక్టివ్ చేసేందుకు కొందరు బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ ఆ పనిని అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. ఢిల్లీలో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :26 December 2022,8:00 pm

BRS Membership : బీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి. ఈ పార్టీ ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే కాదు.. యావత్ దేశమంతా విస్తరించింది. ఇప్పటికే తెలంగాణకు బార్డర్ గా ఉన్న కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. ఆ రాష్ట్రాల్లో పార్టీని యాక్టివ్ చేసేందుకు కొందరు బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ ఆ పనిని అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా ప్రారంభం అయింది. అయితే.. తెలంగాణ తెలుగు రాష్ట్రం కావడంతో మరో తెలుగు రాష్ట్రం అయిన ఏపీపై ముందు

ఫోకస్ పెంచారు సీఎం కేసీఆర్. అక్కడ కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దాన్ని క్యాష్ చేసుకునేందుకు.. ఏపీలో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ పెట్టినందుకు శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా ఏపీలో పలు చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు.. బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఘన స్వాగతం పలికారు. అందుకే.. తెలంగాణ తర్వాత కేసీఆర్ టార్గెట్ ఏపీకి షిఫ్ట్ అయింది. అయితే.. ఏపీలో త్వరలోనే పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

brs party bumper offer to party workers who take membership

brs party bumper offer to party workers who take membership

BRS Membership : ఏపీలో త్వరలోనే పార్టీ కార్యాలయం

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పెషల్ కేర్ తీసుకోనున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ఏపీలో వేగవంతం చేశారు. అలాగే.. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వాళ్లకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. దాని కోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ ను ఏర్పాటు చేశారు. 9491015222 అనే నెంబర్ కు ఫోన్ చేసి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. దీని వల్ల.. బీమా సౌకర్యం కూడా కల్పిస్తారు కాబట్టి.. చాలామంది ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది