Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు (Tanneeru Satyanarayana Rao) ఈ రోజు (మంగళవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర రాజకీయ వర్గాలలో దుఃఖం నెలకొంది.మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రచారం ఊపందుకుంది.
#image_title
తాత్కాలిక బ్రేక్..
అయితే హరీశ్ రావు తండ్రి మృతి కారణంగా పార్టీ ప్రచార కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ స్వయంగా హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సాంత్వన తెలిపారు. అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకు అక్కడే ఉండనున్నట్లు కేటీఆర్ చెప్పారు
బీఆర్‌ఎస్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ..“మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారి తండ్రి మరణించిన దృష్ట్యా, ఈ రోజు బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలు మరియు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం రద్దు చేస్తున్నాము” అని ప్రకటించింది.హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు స్థానికంగా గౌరవనీయుడైన వ్యక్తి. ఆయన మరణం బీఆర్‌ఎస్ కుటుంబానికి తీరని లోటు అని పార్టీ నాయకులు భావిస్తున్నారు.