Business Idea : ఈ పథకంలో రోజుకు రూ.50 చెల్లిస్తే… రూ. 35 లక్షలు మీ సొంతం…
Business Idea : మనకు ముందు రోజుల్లో ఎటువంటి కష్టం రాకుండా ఉండాలంటే ముందుచూపు అనేది చాలా అవసరం. అలాగని రిస్క్ తో కూడిన పెట్టుబడులను పెడితే భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడుతుంది. చాలామంది చిన్న మొత్తంలో ధనాన్ని దీర్ఘకాలం పొదుపు చేయాలని అనుకుంటారు. అందుకనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు రిస్క్ ఫ్రీ స్కీమ్స్ లో డబ్బులు పొదుపు చేయాలి. ఇలాంటి రిస్క్ ఫ్రీ స్కీమ్స్ కి ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్ట్ ఆఫీస్ మంచి అవకాశం అని చెప్పాలి. ఈ పోస్ట్ ఆఫీస్ వలన ప్రజలకు డబ్బులు పొదుపు చేసుకునే అవకాశం కలిగింది. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఈ పోస్ట్ ఆఫీస్ ల వలన తమ భవిష్యత్తుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోస్ట్ ఆఫీస్ లో చిన్న మొత్తంలో డబ్బును దీర్ఘకాలం పొదుపు చేసుకునేందుకు వివిధ రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి.
అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక స్కీం లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒకటే పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన స్కీమ్. ఈ పథకానికి కనీస అర్హత వయసు 19 ఏళ్ళు ఉండాలి. అలాగే గరిష్ట వయసు 55 ఏళ్లు ఉండాలి. కనీసం మొత్తం రూ.10,000 గరిష్ట మొత్తం రూ.10 లక్షలు ఉండాలి. నాలుగేళ్ల తర్వాత రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. ఐదేళ్ల కన్నా ముందే స్కీమ్ లో నుంచి బయటకు వస్తే బోనస్ లభించదు. పాలసీదారుడు 59 ఏళ్ల వయస్సు వరకు పాలసీని ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రీమియం చెల్లింపు ఆగిపోయిన సంవత్సరం వరకు లేదా మెచ్యూరిటీ నిండిన ఏడాదిలోపు ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకునే అవకాశం ఉండదు.

Business ideas central government scheme
ఈ పాలసీ ద్వారా 55, 58, 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి రూ.1000 కి రూ.60 బోనస్ గా ఉంది. ఒకవేళ మెచ్యూరిటీ కన్నా ముందే పాలసీని సరెండర్ చేస్తే తక్కువ మొత్తంలో బోనస్ లభిస్తుంది. ఈ పథకంలో పాలసీదారుడు ప్రతిరోజూ రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు రిటర్న్ పొందవచ్చు. రోజుకి రూ.50 అంటే నెలకు రూ.1515 అవుతుంది. 55 ఏళ్ల వరకు పాలసీ కడితే మెచ్యూరిటీ నాటికి పది లక్షలు అవుతుంది. కానీ బెనిఫిట్స్ తో కలుపుకొని పాలసీదారుడికి మొత్తం 31 లక్షల 60000 అందుతుంది. అదే 60 ఏళ్ల టర్మ్ కి పాలసీ చెల్లించినట్లయితే అన్నీ కలిపి రూ.34.60 లక్షలు వస్తుంది. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది.