LIC | ఎల్ఐసీ వాటా విక్రయానికి కేంద్రం సిద్ధం..రూ.13,000 కోట్ల వరకూ సమీకరణ లక్ష్యం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

LIC | ఎల్ఐసీ వాటా విక్రయానికి కేంద్రం సిద్ధం..రూ.13,000 కోట్ల వరకూ సమీకరణ లక్ష్యం!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 October 2025,7:30 pm

LIC | దేశంలో జీవిత బీమా రంగంలో అగ్రగామి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వాటా విక్రయానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వానికి 96.5% వాటా ఉండగా, గతంలో ఐపీఓ సమయంలో 3.5% వాటాను విక్రయించింది. ఇప్పుడు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిబంధనలకు అనుగుణంగా మరో విడత వాటా విక్రయం జరగనుంది.

#image_title

రూ.13,200 కోట్ల వరకూ వాటా విక్రయం

ప్రభుత్వం ఈసారి 1 నుండి 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,800 కోట్ల నుంచి రూ. 13,200 కోట్ల) విలువైన వాటాను విక్రయించడానికి వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియను డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం త్వరలోనే రోడ్‌షోలు ప్రారంభం కానున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

సెబీ మార్గదర్శకాల ప్రకారం, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలలో కనీసం 10% పబ్లిక్ షేర్ హోల్డింగ్ తప్పనిసరి. 2022 మేలో ఐపీఓ ద్వారా ప్రభుత్వం 3.5% వాటాను విక్రయించి రూ. 20,000 కోట్లకు పైగా సమీకరించింది. ఇక మిగిలిన 6.5% వాటాను 2027 మే నాటికి విక్రయించాలి అని సెబీ సూచించింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది