Farmers : గుడ్‌న్యూస్‌.. రైతుల‌కు 3200 కోట్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : గుడ్‌న్యూస్‌.. రైతుల‌కు 3200 కోట్లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 August 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Farmers : గుడ్‌న్యూస్‌.. రైతుల‌కు 3200 కోట్లు..!

Farmers  : ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం కీలక చర్యకు శ్రీకారం చుట్టింది. ఈ సోమవారం (ఆగస్ట్ 12), దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.3,200 కోట్లకు పైగా పంట బీమా క్లెయిమ్‌లను నేరుగా జమ చేయనుంది.ఈ చారిత్రాత్మక కార్యక్రమం రాజస్థాన్‌లోని ఝుంఝును ఎయిర్‌స్ట్రిప్‌లో నిర్వహించనున్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.

Farmers గుడ్‌న్యూస్‌ రైతుల‌కు 3200 కోట్లు

Farmers : గుడ్‌న్యూస్‌.. రైతుల‌కు 3200 కోట్లు..!

Farmers  వారికి లాభం..

రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అంతేగాక కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల మంత్రులు, అధికారులు, రైతు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఒకే రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా ఇంత భారీ మొత్తంలో పంట బీమా క్లెయిమ్ చెల్లింపులు జరగడం ఇదే మొదటిసారి. ఇది పథకానికి సంబంధించిన పారదర్శకత, సాంకేతికతపై దృష్టిని సూచిస్తుంది,” అని చౌహ‌న్ అన్నారు.

రాష్ట్రాలవారీగా పంపిణీ అవుతున్న బీమా క్లెయిమ్‌లు చూస్తే.. రాజస్థాన్ – రూ.1,121 కోట్లు (7 లక్షల పైగా రైతులకు లాభం), మధ్యప్రదేశ్ – రూ.1,156 కోట్లు, ఛత్తీస్‌గఢ్ – రూ.150 కోట్లు, ఇతర రాష్ట్రాలు – రూ.773 కోట్లు. రాష్ట్ర ప్రీమియం వాటాకు ఆలస్యం చేయకుండా, కేంద్ర సబ్సిడీ ఆధారంగా క్లెయిమ్‌లు చెల్లించేందుకు సరళీకృత పరిష్కార విధానం అమల్లోకి వచ్చింది. 2025 ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే 12% జరిమానా విధించనున్నారు.బీమా కంపెనీలు కూడా చెల్లింపులు ఆలస్యం చేస్తే అదే రేటుతో రైతులకు పడ్డ నష్టాన్ని భరించాలి. ఇప్పటివరకు 78 కోట్ల దరఖాస్తులను కవర్ చేస్తూ, రైతులు చెల్లించిన రూ.35,864 కోట్ల ప్రీమియానికి మారుపట్టుగా రూ.1.83 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను చెల్లించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది