Byreddy Siddharth Reddy : తాడిపత్రి నడిబొడ్డులో జేసీ బ్రదర్స్ పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పంచులు వీడియో వైరల్..!!
Byreddy Siddharth Reddy : వైసీపీ యువజన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించడం జరిగింది. తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పాదయాత్ర ముగింపు సభలో బైరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైయస్ జగన్ పొలిటికల్ దెబ్బకి రాయలసీమలో చాలామంది నాయకులు వ్యవసాయానికి.. ఇంటికే పరిమితం అయ్యారని అన్నారు. గతంలో కుప్పంలో ఎన్నికలు అప్పుడే కనిపించే చంద్రబాబు ఇప్పుడు వైఎస్ జగన్ దెబ్బకి ప్రతినెల కుప్పంలో పర్యటిస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సెటైర్లు వేశారు. రాయలసీమలో దాదాపు 30 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తాడిపత్రి జేసీ బ్రదర్స్ పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పంచ్ డైలాగులు వేయడం జరిగింది. వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన జెసి బ్రదర్స్ నీ జగన్ సార్ చేర్చుకోకపోవడంతో.. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గం లో జెసి కుటుంబం నుండి.. కాపాడే నాయకుడే లేడా అని ఎదురుచూస్తున్న సమయంలో.. కేతిరెడ్డి గారి రూపంలో స్వేచ్ఛ దొరికింది. సేవ్ తాడిపత్రి అని జేసీ బ్రదర్స్ స్లొగన్స్ చేస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కేతిరెడ్డి సేవెడ్ తాడిపత్రి అని అనాలి. జేసీ బ్రదర్స్‌కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. మీడియా ముందు కూర్చుని తాడిపత్రిక నేనే రౌడీని…. అవును నేను అవినీతి చేస్తున్నాను అని వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గంలోకి వస్తే అడ్డుకోవాలని ఆరోజు మీరు ప్రయత్నాలు చేశారు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని బైరెడ్డి ప్రశ్నించడం జరిగింది. తాడిపత్రిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి… జెసి బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.