Good News : ఉద్యోగుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్ప‌నుందా.. రిటైర్మెంట్ వ‌య‌స్సు, పెన్ష‌న్ పెంచే యోచ‌న‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : ఉద్యోగుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్ప‌నుందా.. రిటైర్మెంట్ వ‌య‌స్సు, పెన్ష‌న్ పెంచే యోచ‌న‌

 Authored By mallesh | The Telugu News | Updated on :11 April 2022,9:30 pm

Good News :కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించ‌బోతోంది. కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఎకనమిక్ అడ్వైజరీ కమిటీ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది.రిటైర్మెంట్ వయసు పెంపు, యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ అంశాలపై రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.2 వేలు ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.

సీనియర్ సిటిజన్స్‌కు మెరుగైన సేవలు అందించాలని అభిప్రాయపడింది.అలాగే సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాల్సి ఉంటుందని అలాగే దీని కోసం 50 ఏళ్లు దాటిన వారికి స్కిల్ డెవలప్‌మెంట్ అవసరమని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాలు, ప్రతిభ పెంపు లక్ష్యంగా ఉపాధి కల్పన కోసం కొత్త పాలసీలు తీసుకురావాల్సి ఉందని కమిటీ పేర్కొందని నివేదికలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో

Center for Employees Good News in Increasing retirement age pension

Center Employees Good News in Increasing retirement age pension

Good News : 50 ఏళ్లు దాటిన వారికి స్కిల్ డెవలప్‌మెంట్

అసంఘటిత రంగంలో పని చేసే వారి కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని కమిటీ తెలిపింది.కాగా ప్రపంచ జనాభా లెక్కల అంచనా ప్రకారం చూస్తే.. 2050 నాటికి భారత్‌లో 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చ‌ని అంచ‌నా. అంటే జనాభాలో 19.5 శాతం మంది వీళ్లే ఉంటారు. 2019లో వీరి శాతం కేవలం 10 శాతం మాత్రమే. దాదాపు 14 కోట్ల మంది ఉన్నారు. అందువల్ల వల్ల వీరికి అదిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది. కాగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం త్వ‌ర‌లోనే పెండింగ్ అరియర్స్‌పై ఒక నిర్ణయం తీసుకోవచ్చని స‌మాచారం.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది