YS Jagan : జగన్ దెబ్బకి కదిలి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం !
YS Jagan : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా కీలకమైనచోట్ల గెలవడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రాయలసీమ ప్రాంతంలో మొదటినుండి వైసీపీకీ చాలా అనుకూలంగా ఉంటది. 2014 మరియు 2019 ఎన్నికలలో ఈ ప్రాంతంలో వైసీపీ మెజార్టీ స్థానాలను గెలవడం జరిగింది. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన చాలా ఎన్నికలలో వైసీపీ తిరుగులేని విజయాలు సాధించడం తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో…
తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో అత్యధికమైన ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈ గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదిలా ఉంటే పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ ఆరోపిస్తూ ఉంది. దీంతో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రికౌంటింగ్ చేయాలని వైసీపీ… కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. జగన్ ప్రభుత్వం పశ్చిమ రాయలసీమ ఎన్నికల ఫలితాల అవకతవకలపై చాలా సీరియస్ గా ఉంది. ఇటువంటి తరుణంలో జగన్ పార్టీ రాసిన లెటర్ కి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు..
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విషయంలో రీకౌంటింగ్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదవ రౌండ్ లో కొంతమంది అధికారులలో టీడీపీ సానుభూతి పరులు 19వ టేబుల్ దగ్గర…వైసీపీకీ.. అభ్యర్థి ఓట్లను.. తీసుకుపోయి తెలుగుదేశం పార్టీలో కలపడం జరిగిందని ఆరోపించారు. దాదాపు వైసీపీకి చెందిన 30 వేల ఓట్లను అక్రమంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికీ కలిపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పరిస్థితులలో పశ్చిమ రాయలసీమ పట్టాబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలో… రీకౌంటింగ్ చేయాలని వైసీపీ పార్టీ… కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయటం సంచలనం సృష్టించింది.