Youtube Channels : యూట్యూబ్ ఛానళ్లకు బ్యాడ్ న్యూస్.. అవి పాటించకపోతే బ్యాన్ చేస్తాం కేంద్రం హెచ్చరిక..!
Youtube Channels : కేంద్రం యూట్యూబ్ ఛానళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై దేశ గౌరవాన్ని కించపరిచేలా వార్తలు ప్రసారం చేస్తే అలాంటి ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దేశ భద్రతకు నష్టం కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేస్తూ ఆయా ఛానళ్లను
బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. భారత ఐటీ చట్టం 2021 ప్రకారం ఆయా ఛానళ్లపై వాటిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లు పాకిస్థాన్ కేంద్రంగా నడపబడుతున్నట్లు గుర్తించామని వివరించారు.

central govt banned 20 youtube channels
పాక్ సహాయ సహకారాలతో భారత్‌లో విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయిని అన్నారు. ఇకపై యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లపై ప్రభుత్వం నిఘా ఉంటుందంటూ.. దేశ పౌరుల మధ్య విభేదాలు సృష్టిస్తే ఇక సహించబోమన్నారు.