Amaravathi : బిగ్ బ్రేకింగ్.. ఏపీ రాజధాని అమరావతే.. కేంద్రం క్లారిటీ…!
Amaravathi ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి Amaravathi కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో బిజెపి ఎంపీ అడిగిన ప్రశ్నపై స్పందించిన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కీలక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రాజధానిపై అనేక అనుమానాలు వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అనడం దానికి సంబంధించి బిల్లు ప్రవేశ పెట్టడం వంటివి జరిగాయి. ఇక దానికి సంబంధించి ఏపీ హైకోర్ట్ లో కేసు విచారణలో ఉండగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలోనే పరిపాలన కొనసాగిస్తుంది.
తాజాగా బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో కీలక ప్రశ్న అడిగారు. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని చెప్తూ… 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని ఆయన ప్రశ్నించగా… కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది? అని ఆయన అడగగా దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్… మూడు రాజధానులు అని చెప్పారని కాని తర్వాత బిల్లులను వెనక్కు తీసుకున్నారని కాని ఇప్పుడు రాజధాని అమరావతే అని ఆయన పేర్కొన్నారు.