Covid : Alert కోవిడ్ బాధితులకు కేంద్రం రూ. 5 వేల సాయం.. బురిడి కొట్టిస్తున్న మోసగాళ్లు..!
Covid : కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి ఆపత్కాల సాయం కింద కేంద్రం రూ. 5 వేల నగదు ఇస్తోందట. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తలు మీరూ విన్నారా..! అయితే ఒక్క విషయం తెలుసుకోండి. ఇదంతా వట్టి అసత్య ప్రచారం. అవును సైబర్ నేరగాళ్ల కొత్త పంథా ఇది. సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ తమ వైఖరి మారుస్తూ లక్షలు మాయం చేస్తున్నారు.
కరోనా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బాధితులకు కోవిడ్ ఫండ్స్ నుంచిరూ.5వేలు అందిస్తోందని వైరల్ చేస్తున్నారు. దీనికి ఆ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 15వ తేదీ చివరి గడువు అంటున్నారు. లింక్‌లను పెడుతూ అందులో బ్యాంకు వివరాలు ఎంటర్ చేయిస్తూ.. అయా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే కోవిడ్ రిలీఫ్ ఫండ్ అనే స్కీమ్ ఏమీ లేదని.. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.
Covid : కోవిడ్ బాధితులకు కేంద్రం రూ. 5 వేల సాయం.. జనవరి 15 గడువు తేదీ..?
కోవిడ్ ఫండ్ పేరిట వచ్చే మెసేజ్ లింక్‌లపై క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంకు వివరాలు, వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని, ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఖాళీ చేస్తారని కేంద్రం హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా, తిండిలేక ఎన్నో కష్టాలను పడ్డారు. అదే అదనుగా భావించి కొందరు మోసగాళ్లు జనాలను బురిడి కొట్టిస్తున్నారు.