YS Jagan : ఉఫ్.. కష్టకాలంలో ఉన్న జగన్ సర్కారుకు కాస్త ఊరట.. జగన్ కు తిరుగులేదిక?
YS Jagan : ప్రస్తుతం ఏపీ సర్కారుకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఏపీకి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి. కష్టకాలంలో ఉన్న జగన్ సర్కారుకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది. దీంతో జగన్.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అందుకే వరదల కారణంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం 280 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. వరద సాయం తక్కువే అయినప్పటికీ.. ఎంతో కొంతమేర ఈ సాయం ఏపీకి ఉపయోగపడే అవకాశం ఉంది.
ఎందుకంటే.. ఏపీకి వరదలు వచ్చిన సమయంలోనే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చాయి. అంతకుముందు కూడా మరికొన్ని రాష్ట్రాల్లో వరదల వల్ల భారీ నష్టం సంభవించింది. అయితే.. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రానికి వెయ్యి కోట్లను పరిహారంగా కేంద్రం ప్రకటించింది. కానీ.. దక్షిణ రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి.. మూడింటికి కలిపి 577 కోట్లను మాత్రమే కేటాయించింది. అందులో ఏపీకి 280 కోట్లను కేటాయించింది.
హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ
అయితే.. దీనికి సంబంధించి.. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి కేంద్ర సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఏపీతో సహా నాలుగు రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీకి జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి కింద వరద సాయాన్ని అందిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.