7Th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. 3 శాతం పెరిగిన డీఏ.. ఎంత జీతం పెరుగుతోందో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెవెన్త్ పే కమిషన్ సిఫారసు ప్రకారం.. డీఏ, డీఆర్ లను పెంచుతున్నట్టు ప్రకటించింది. మరో 3 శాతం డీఏ, డీఆర్ ను పెంచింది.జులై 1, 2021 నుంచే ఈ ఇంక్రిమెంట్ అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. త్వరలో రాబోతున్న హోలి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు కేంద్రం వెల్లడించింది.
ఈ పెంపు వల్ల కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ ఇంక్రిమెంట్ అమలులోకి రానుంది. దీని వల్ల ఉద్యోగులకు కనీసం వెయ్యి రూపాయల వేతనం పెరగనుంది. వెయ్యి నుంచి ఎనిమిది వేల వరకు వేతనం పెరగనుంది.డీఏతో పాటు.. డీఆర్ ను కూడా కేంద్రం పెంచింది. డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లోని సివిల్ ఉద్యోగులకు రిస్క్ అలవెన్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఉద్యోగులకు కనీసం వెయ్యి నుంచి 8 వేల వరకు జీతం పెరగనుంది.ఇప్పటికే కేంద్రం 28 శాతం డీఏను పెంచిన విషయం తెలిసిందే.
7Th Pay Commission : రిస్క్ అలవెన్స్ ను కూడా పెంచిన కేంద్రం
3 శాతం పెరగడంతో అది 31 శాతానికి పెరిగింది. 17 శాతం ఉన్న డీఏను జులై 21లో 28 శాతానికి పెంచారు. మరోవైపు మధ్యప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సెవెన్త్ పే కమిషన్ ప్రకారం డీఏలను పెంచాయి. దీంతో ఆయా రాష్ట్రాల ఉద్యోగులకు కూడా జీతాలు పెరగనున్నాయి.అలాగే.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏ, డీఆర్ ను పెంచింది. మరోసారి హోలికి ముందు 3 శాతాన్ని కేంద్రం పెంచితే అది 34 శాతానికి పెరగనుంది.