Central Govt : మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త… ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ లో ఈ ఖాతాను తెరవండి..!
ప్రధానాంశాలు:
Central Govt : మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త... ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ లో ఈ ఖాతాను తెరవండి..!
Central Govt : తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళ సాధికారత కోసం మహిళ సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేయడం జరిగింది. మహిళ సమ్మన్ పథకం అనేది ఒక పొదుపు పథకం. ఈ పథకం కేవలం మహిళల కోసం మాత్రమే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మహిళలకు మెరుగైన వడ్డీ రేటును అందించడం. అందుకే దీనిని మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన అత్యుత్తమ పెట్టుబడి పతకమని పిలుస్తూ ఉంటారు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ MSSC స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి…?ఈ పథకానికి ఎవరు అర్హులు…?దరఖాస్తు కోసం అవసరమైన పాత్రలు ఏంటి అనే వివరాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో మహిళలు పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక వడ్డీని పొందవచ్చు. తద్వారా మహిళలు ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది. తపాలా శాఖ నిర్వహిస్తున్న ఈ మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం అనేది భారతదేశంలోని మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక ఈ పథకం ద్వారా మహిళలకు కేంద్ర ప్రభుత్వం 7.5% వడ్డీని అందించడం జరుగుతుంది. అయితే మీరు ఈ ఖాతాని మూసివేసినప్పుడు 7.5% వడ్డీకి బదులుగా 5.5% వడ్డీ పొందుతారు. అయితే మహిళలు ఈ పథకం ద్వారా స్వల్పకాలానికి పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు. అయితే ఈ పథకంలో మహిళలు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి 2 లక్షలు గా నిర్ణయించడం జరిగింది.
Central Govt MSSC స్కీమ్ కి అర్హులు ఎవరంటే…
– ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి.
– ఈ పథకం కేవలం మహిళలు మరియు బాలికలకు మాత్రమే.
– కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి వ్యక్తిగత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
– మహిళలు ఈ పథకాన్ని పొందాలంటే పోస్ట్ ఆఫీస్ లేదా అధికృత బ్యాంకులలో MSSC ఖాతాను తెరవచ్చు.
– 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన బాలికలు లేదా వారి తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవడానికి అర్హులవుతారు.
– ఈ పథకంలో ఖాతా తెరిచేందుకు మీరు ఫారమ్ 1 పూర్తి చేయాల్సి ఉంటుంది.
Central Govt దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు..
– పాస్ పోర్ట్ సైజ్ ఫోటో..
– జనన ధ్రువీకరణ పత్రం.
– ఆధార్ కార్డు పాన్ కార్డు
– గుర్తింపు ధ్రువీకరణ పత్రం
– చిరునామా ధ్రువీకరణ పత్రం.