BREAKING : ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BREAKING : ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 October 2022,10:00 pm

BREAKING : ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉంది. కానీ.. ఏపీలో ఒకవేళ ముందస్తుగా ఎన్నికలు వస్తే. సీఎం జగన్ ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే ఎలా. అందుకే.. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే అందరూ సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఈసందర్భంగా పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జీలు, ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నకలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నిజానికి ఇప్పుడే కాదు.. చాలా రోజుల నుంచి చంద్రబాబు ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నారు.

ఎందుకంటే.. 2018 లోనూ తెలంగాణలో సీఎం కేసీఆర్ అదే పని చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి గెలిచారు. ముందస్తుకు వెళ్లడం వల్లే కేసీఆర్ రెండోసారి గెలిచారని అందరూ అప్పట్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా అని అనుకుంటున్నారు. అయితే.. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ముందస్తు ఎన్నికల ఊహాగానాలను కొట్టి పారేశారు. అసలు.. ముందస్తు అనే అంశమే వైసీపీలో చర్చకు రాలేదన్నారు. చంద్రబాబుకు ఎందుకు ముందస్తు ఎన్నికల ప్రస్తావన వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.

Chandrababu alerts tdp leaders for early elections in ap

Chandrababu alerts tdp leaders for early elections in ap

BREAKING : ముందస్తు ఎన్నికల ఊహాగానాలను కొట్టి పారేసిన సజ్జల

అలాగే.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని అందరూ తమ పనితీరు ద్వారా చెప్పాలన్నారు. లేదంటే పార్టీ వేరే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఒకవేళ నిజంగానే ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు మాత్రం సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్స్ అందరికీ టికెట్లు ప్రకటించారు. పార్టీలో రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు. సిట్టింగ్స్ అందరికీ టికెట్ ఖాయం అవడం, మరోవైపు వేరే పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుండటం చూస్తుంటే ఖచ్చితంగా ముందస్తు వస్తే ఏ మాత్రం లేట్ చేయకుండా ముందస్తుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది